Begin typing your search above and press return to search.

అసలు సమంత ఎందుకు రాలేదట

By:  Tupaki Desk   |   26 May 2018 5:36 PM GMT
అసలు సమంత ఎందుకు రాలేదట
X
సినిమా కోసం ఏడాది పాటు కష్టపడి చివరికి బాగాలేదు అంటే ఎవ్వరికైనా ఎంతగానో బాధ కలుగుతుంది. అదే విధంగా సక్సెస్ అయితే.. నటనకు మంచి ప్రశంసలు అందితే ఆ ఆనందానికి అవధులు ఉండవు. ముఖ్యంగా కష్టపడిన దానికి తగిన ఫలితం దొరికిందనిక్ సంతృప్తి ఉంటుంది. ఇక సక్సెస్ మీట్ లకు ఇతర ప్రముఖులు ఇచ్చే గౌరవ సత్కారాల ఈవెంట్స్ కు వెళ్లాలని ఉంటుంది. అయితే రీసెంట్ సమంత మాత్రం అలాంటి వేడుకలకు డుమ్మా కొట్టేసింది.

మహానటి సినిమా విడుదలై ఎంతటి ఘన విజయాన్ని అందుకుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ముఖ్యంగా సమంత చేసిన పాత్రకు మంచి ప్రశంసలు అందాయి. అయితే సినిమా ప్రమోషన్స్ లో బాగానే పాల్గొన్న అమ్మడు సక్సెస్ ఈవెంట్స్ కు మాత్రం రాలేదు. అల్లు వారు ఇచ్చిన డిన్నర్ కి కూడా వెళ్లని సమంత ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్వహించిన సత్కార వేడుకలో కూడా పాల్గొనలేదు.

మహానటి సినిమాను అద్భుతంగా తెరకెక్కించినందుకు చిత్ర యూనిట్ ను నటీనటులను చంద్రబాబు ప్రత్యేకంగా గౌరవించారు. ఈ ఈవెంట్ కి ముందు ప్రతి ఒక్క నటీనటులకు ఆహ్వానాన్ని అందించగా సమంత మాత్రం షూటింగ్ లో చాలా బిజీ అని చెప్పి డుమ్మా కొట్టేసింది. ముందుగా వేసుకున్న ప్లాన్ ప్రకారం అందరికి తీరిక ఉన్నప్పుడే ఈవెంట్ ను ప్లాన్ చేశారు. కానీ చివరి నిమిషంలో అక్కినేని వారు కోడలు హ్యాండ్ ఇవ్వడం అందరిని షాక్ కి గురి చేసిందట. మరి అది ఎంతవరకు నిజమో తెలియాలంటే ఆమెనే చెప్పాలి.