Begin typing your search above and press return to search.

ఇంతకీ విన్నర్ ఎవరు-సంక్రాంతి 2018?

By:  Tupaki Desk   |   14 Jan 2018 6:08 PM GMT
ఇంతకీ విన్నర్ ఎవరు-సంక్రాంతి 2018?
X
జనవరి 10వ తేది కంటే ముందు ఎన్నెనో ఆశలు. ఏవేవో లెక్కలు. టాలీవుడ్ లో గత కొంత కాలంగా సరైన సినిమా లేక బాక్స్ ఆఫీస్ స్తబ్దుగా ఉన్న నేపధ్యంలో సినిమా ప్రియుల ఆకలి తీర్చడానికి ఏకంగా నాలుగు సినిమాలు వస్తున్నాయి అనగానే ప్రేక్షకులతో పాటు బిజినెస్ వర్గాల్లో కూడా ఎన్నో అంచనాలు మొదలయ్యాయి. అన్ని దేనికవే విడిగా క్రేజ్ ఉన్నవి కావడం, నిర్మాణ సంస్థలన్నీ తలపండినవి కావడం వీటికి మరింత ఊతం ఇచ్చింది. ఇంకొన్ని సినిమాలు కూడా లైన్ లో ఉన్నప్పటికీ వీటిని చూసే ధైర్యం చేయలేకపోయాయి. విడుదలకు ముందు వరకు వీటిలో ఏది నెగ్గుతుందా అనే దాని మీద మూవీ లవర్స్ ఎదురుచూపులు సాగాయి. మరి వాస్తవం ఎలా ఉందో చూద్దాం.

అజ్ఞాతవాసి ఫలితం గురించి పదే పదే చర్చించి లాభం లేదు. ట్రేడ్ తో సహా అందరూ ముక్త కంఠంతో ఇది డిజాస్టర్ అని తేల్చేసారు. నష్టాల శాతం ఎంత నిష్పత్తిలో ఉంటుంది అనే దాని గురించి మాత్రమే ఎదురు చూడాలి. నిన్నటి నుంచి కొద్దిగా ట్రిమ్ చేసి వెంకటేష్ నటించిన సన్నివేశాలు జోడించినా దాని ఫలితం టికెట్ కౌంటర్స్ దగ్గర కనిపించడం లేదు. ఈ రోజు ఆదివారం, భోగి సెలవు కావడంతో కొంత మెరుగు కనిపిస్తోంది కాని మంగళవారంతో మొత్తం దుకాణం సర్దే పరిస్థితి చాలా చోట్ల నెలకొంది. వంద కోట్లకు పైగా బిజినెస్ జరిగింది అని చెప్పబడుతున్న అజ్ఞాతవాసి షేర్ రూపంలో సగం రాబట్టినా గొప్పే. కాని జరిగే పరిస్థితులు లేవు.

ఇక మాస్ అవతారంలో బాలకృష్ణ నటించిన జైసింహ టాక్ కూడా ఏమంత గొప్పగా లేనప్పటికీ సంక్రాంతి పండుగను సినిమాతో జరుపుకునే అలవాటు ఉన్న మాస్ ప్రేక్షకులకు జైసింహనే బెటర్ ఆప్షన్ గా కనిపించడం కొంత ఊరట కలిగించే అంశం. ఏళ్ళ నాటి పాత ఫార్ములాలో దర్శకుడు కెఎస్ రవికుమార్ తీసిన తీరు అన్ని వర్గాల నుంచి మెప్పు పొందలేదు. సెంటిమెంట్, ఎమోషన్స్ కొంత వరకు వర్క్ అవుట్ అయ్యేలా కథనం ఉండటంతో పవన్ సినిమాతో పోల్చుకుని ఇది మెరుగు అంటున్నారే తప్ప జైసింహ ఔట్ రైట్ గా సూపర్ హిట్ మూవీ అనే రేంజ్ లో లేదు అన్నది వాస్తవం.

ఇక సూర్య గ్యాంగ్ ఎత్తుగడలు అంతగా ఫలించలేదు అనేది వసూళ్ళ లెక్కల్లో స్పష్టంగా కనిపిస్తోంది. హింది మూవీ స్పెషల్ చబ్బీస్ రీమేక్ గా వచ్చిన ఈ మూవీ కాస్త ఖంగాలీ కథనంతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో పూర్తిగా సఫలం కాలేదు. కొన్ని ఎపిసోడ్స్ బాగానే వచ్చినప్పటికీ అది సినిమా మొత్తాన్ని కాపాడే రేంజ్ లో లేకపోవడం విజయావకాశాలను దెబ్బ తీస్తోంది. పాటల్లో తమిళ వాసన, పాత్రలకు తగ్గ నటులు సెట్ కాకపోవడం మనవాళ్ళకు కనెక్ట్ కావడం లేదు. యావరేజ్ కన్నా ఒక మెట్టు కిందే నిలిచే అవకాశాలు ఉన్నాయి.

ఇక రాజు తరుణ్ నటించిన రంగుల రాట్నంపై భారీ అంచనాలు లేకున్నా ఫ్యామిలీ సెక్షన్ ఆడియన్స్ దీని కోసం ఎదురు చూసారు. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నాగార్జున నిర్మించిన సినిమా కావడం ప్లస్ అయ్యింది. కాని దర్శకురాలు శ్రీరంజని తీసుకున్న పాయింట్ టార్గెట్ ను మెప్పించేదే అయినా కథనాన్ని బాగా నెమ్మదిగా నడిపించి ఎమోషన్స్ ని బలంగా రిజిస్టర్ చేయటం కోసం కథనాన్ని సాగదీయటంతో యూత్ కూడా కాస్తంత అసహనంగానే చూస్తున్నారు. రాజ్ తరుణ్-సితార-చిత్రా-ప్రియదర్శన్ అందరు చక్కని పెర్ఫోర్మన్స్ ఇచ్చినప్పటికీ ఓవరాల్ గా సహనానికి పరీక్ష పెట్టినట్టే ఫీల్ అవ్వడం సినిమా సూపర్ హిట్ కాకుండా అడ్డు పడ్డాయి. సో రంగుల రాట్నం సర్ప్రైజ్ హిట్ అయ్యే అవకాశాలు లేవు. పెట్టిన బడ్జెట్, అమ్మిన రేట్లు తక్కువ మొత్తం కాబట్టి నష్టం భయపడెంత ఉండకపోవచ్చు.