Begin typing your search above and press return to search.

ఈసారి ఎన్నిక‌ల్లో విశాల్ ప్ర‌త్య‌ర్థి ఎవరు?

By:  Tupaki Desk   |   12 Jun 2019 10:18 AM GMT
ఈసారి ఎన్నిక‌ల్లో విశాల్ ప్ర‌త్య‌ర్థి ఎవరు?
X
ఎన్నిక‌లు అంటేనే హీట్! అది జ‌న‌ర‌ల్ ఎల‌క్ష‌న్స్ అయినా .. కోఆప‌రేటివ్ ఎల‌క్ష‌న్స్ అయినా లేదూ ఏదైనా సినిమా అసోసియేష‌న్ల‌కు సంబంధించిన ఎన్నిక‌లు అయినా అగ్గి రాజుకోవ‌డం త‌ప్ప‌నిస‌రి. ప్ర‌త్య‌ర్థిపై గెలిచేందుకు ఆరోప‌ణ‌లు ప్ర‌త్యారోప‌ణ‌లు ఓ రేంజులో ఉంటాయి. ఇటీవ‌లే తెలుగు మూవీ ఆర్టిస్టుల సంఘం (మా) ఎన్నిక‌ల్లో శివాజీ రాజా ప్యానెల్ .. సీనియ‌ర్ న‌రేష్ ప్యానెల్ మ‌ధ్య హోరాహోరీ గురించి తెలిసిందే. ఆరోప‌ణ‌లు- ప్ర‌త్యారోప‌ణ‌ల‌తో ఎల‌క్ష‌న్ వార్ ని త‌ల‌పించింది. ఎట్ట‌కేల‌కు తెలుగు ఆర్టిస్టుల‌కు సీనియ‌ర్ న‌రేష్ అధ్య‌క్షుడ‌య్యారు.

ఇక ఇరుగు పొరుగు ప‌రిశ్ర‌మ‌ల్లో ఎన్నిక‌ల మాటేమిటి? అంటే.. టోట‌ల్ సౌతిండియా ఆర్టిస్టులకే ఓ అసోసియేషన్ ఉన్న సంగ‌తి తెలిసిందే. మ‌ద్రాసు కేంద్రంగా ర‌న్ అవుతున్న దీని పేరు న‌డిగ‌ర‌సంఘం. ప్ర‌స్తుతం నాజ‌ర్ అధ్య‌క్షుడిగా.. విశాల్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా ర‌న్ అవుతోంది. గ‌త ఎన్నిక‌ల్లో న‌డిగ‌ర సంఘం సొంత బిల్డింగ్ నిర్మాణ‌మే ధ్యేయంగా నాజ‌ర్- విశాల్ ప్యానెల్ ప‌ద‌వీ బాధ్య‌త‌ల్ని చేప‌ట్టిన సంగ‌తి తెలిసిందే. ఇక ఇప్ప‌టికే రెండేళ్ల‌ గ‌డువు ముగియ‌డంతో ఎన్నిక‌ల‌కు కొత్త తేదీని ప్ర‌క‌టించారు. ఈనెల 23న న‌డిగ‌ర సంఘం ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి.

ఈసారి నాజ‌ర్ - విశాల్ ప్యానెల్ కి పోటీగా సీనియ‌ర్ ద‌ర్శ‌క‌ర‌చ‌యిత- న‌టుడు భాగ్య‌రాజ్ ప్యానెల్ బరిలో దిగుతోంది. ఇప్ప‌టికే భాగ్య‌రాజ్ ప్యానెల్ నాజ‌ర్ బృందంపై తీవ్ర ఆరోప‌ణ‌లు చేసింది. న‌డిగ‌ర సంఘం సొంత బిల్డింగ్ నిర్మాణం ఎందుకింత ఆల‌స్య‌మైంది? అని ప్ర‌శ్నిస్తూ.. తాము ఎన్నికైతే భ‌వంతి నిర్మాణం వెంట‌నే పూర్తి చేస్తామ‌ని ప్ర‌క‌టించారు భాగ్య‌రాజా. అయితే న‌డిగ‌ర సంఘం భ‌వంతి నిర్మాణం కోసం విశాల్ బృందం కోటి విరాళం ప్ర‌క‌టించ‌డ‌మే గాక నిధి సేక‌ర‌ణ కోసం ప్ర‌య‌త్నించారు. అయితే దానికి తంబీలు కుట్ర‌దారులుగా మారి చేసినదేంటో చూస్తున్న‌దే. ప్ర‌స్తుతం న‌డిగ‌ర సంఘం మాజీ అధ్య‌క్షుడు శ‌ర‌త్ కుమార్ స‌హా రాధార‌విపైనా విశాల్ పోరాడుతూనే ఉన్నారు. న‌డిగ‌ర సంఘం స్థ‌లానికి సంబంధించిన వివాదాన్ని ప‌రిష్క‌రించేందుకు కృషి చేస్తున్నాడు. అయితే ఈసారి ఎన్నిక‌ల్లో నాజ‌ర్ - విశాల్ బృందం గెలుస్తుందా.. లేదా? విశాల్ పై ఆర్టిస్టుల న‌మ్మ‌కం ఎంత‌? అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. ఇక ఇరు ప్యానెల్స్ నుంచి ప‌లువురు అభ్య‌ర్థుల నామినేష‌న్ల‌ను ఎల‌క్ష‌న్ క‌మిటీ తిర‌స్క‌రించ‌డం వివాదాల‌కు తావిస్తోంది. ఇక కార్తీ - పొన్ వ‌న్న‌న్ త‌దిత‌రులు విశాల్ కి అండ‌గా నిలుస్తున్న సంగ‌తి తెలిసిందే. సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ - విశ్వ‌న‌టుడు క‌మ‌ల్ హాస‌న్ వంటి వారు ఏ ప్యానెల్ కి మ‌ద్ధ‌తు ప‌ల‌క‌కుండా న్యూట్ర‌ల్ గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. మ‌రి వీళ్ల ఓట్లు ఏ ప్యానెల్ కి ప‌డ‌తాయి? ఎవ‌రికి మ‌ద్ధ‌తునిస్తారు? అన్న‌ది వేచి చూడాల్సిందే.