ఎవరీ డైసీ ఎడ్గర్ జోన్స్ ? : ఆర్ ఆర్ ఆర్

Thu Mar 14 2019 16:44:46 GMT+0530 (IST)

ఇవాళ ఆర్ ఆర్ ఆర్ ప్రెస్ మీట్ లో రాజమౌళి అఫీషియల్ గా హీరోయిన్ల పేర్లు ప్రకటించాడు. అలియా భట్ పేరు ముందు నుంచే ప్రచారంలో ఉంది కాబట్టి అందులో పెద్ద ఎగ్జైట్మెంట్ అనిపించలేదు. పైగా తను హిందీ సినిమాల ద్వారా సుపరిచితురాలే కనక చరణ్ కు తగ్గ జోడి అని అందరు సంతోషపడ్డారు. అయితే యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ సరసన జక్కన్న ప్రకటించిన పేరు అందరికి ఆశ్చర్యాన్ని కలిగించింది.డైసీ ఎడ్గర్ జోన్స్. ఇంగ్లీష్ లో చూపిస్తే అక్షరాలు పలకడానికి కూడా కొందరు కష్టపడే ఈ అమ్మాయి బ్రిటిష్ సుందరి. కాకపోతే తన వివరాలు తెలియక తారక్ ఫాన్స్ తెగ ఇదైపోతున్నారు. రాజమౌళి తనను ప్రత్యేకంగా ఎంచుకోవడానికి కారణాలు వెతుకుతున్నారు. డైసీ సుప్రసిద్ధ నేషనల్ యూత్ థియేటర్ లో శిక్షణ తీసుకున్న నటి. ఇందులో నుంచే హెలెన్ మిర్రెన్-కాథరిన్ టేట్ లాంటి నటీనటులు వచ్చారు. తొలుత సైలెంట్ విట్ నెస్-అవుట్ నెంబర్డ్ లాంటి షోల పేరు తెచ్చుకున్న డైసీ బ్రిటిష్ కామెడీ డ్రామా సిరీస్ కోల్డ్ ఫీట్ తో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకుంది.

అందులో విభేదాలతో నిత్యం కొట్టుకునే తల్లితండ్రుల మధ్య నలిగిపోయే ఒక కవలగా ఆ పాత్రలో జీవం పోసింది. గత ఏడాది పాండ్ లైఫ్ అనే మరో టీవీ సిరీస్ కూడా తనకు చాలా పాపులారిటీ తెచ్చింది. వార్ అఫ్ ది వరల్డ్ సిరీస్ కూడా తన ఖాతాలోనే ఉంది. చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి మొదలుకుని టీనేజ్ యాక్టర్ దాకా ఎదగడంలో డైసీ చాలా కష్టపడింది.

ఇప్పుడు ఈ గుణమే ఇండియన్ సినిమాలో అందులోనూ ఆర్ఆర్ఆర్ లాంటి క్రేజీ ప్రాజెక్ట్ తో అడుగు పెట్టే అవకాశాన్ని ఇచ్చింది. అయితే బ్రిటిష్ సుందరి కాబట్టి ఇందులో డైసీ పాత్ర అదే తరహాలోనే ఉండొచ్చు. భారతీయ విప్లవ వీరుడిని ప్రేమించిన ఇంగ్లీష్ సుందరిగా తన పాత్రను ప్రత్యేకంగా డిజైన్ చేసినట్టు సమాచారం. సో నిన్నటి దాకా టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమే లేని డైసీ పేరు ఇంకో రెండేళ్ల వరకు నానుతూనే ఉంటుంది