Begin typing your search above and press return to search.

కింగ్ ఖాన్ కూతురు డేటింగ్ ఎవ‌రితో?

By:  Tupaki Desk   |   17 Feb 2019 9:59 AM GMT
కింగ్ ఖాన్ కూతురు డేటింగ్ ఎవ‌రితో?
X
కింగ్ ఖాన్ షారూక్ కుమార్తె సుహానా ఖాన్ తెరంగేట్రంపై ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. 2018లో సుహానా డెబ్యూ సినిమా గురించి ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగింది. అయితే ప్ర‌స్తుతం ఈ బ్యూటీ బ్రిట‌న్ లో చ‌దువులు కొన‌సాగిస్తోంది. సాధ్య‌మైనంత తొంద‌ర్లోనే సుహానాను క‌థానాయిక‌గా ప‌రిచ‌యం చేస్తాన‌ని, త‌న ఆస‌క్తి మేర‌కే సినీఆరంగేట్రానికి ఓకే చెప్పాన‌ని ఖాన్ దాదా చెప్పారు. ఓవైపు ఖాన్ గిరీ అంత‌కంత‌కు త‌గ్గుతున్న వేళ అత‌డి లెగ‌సీని ముందుకు తీసుకెళ్లే న‌ట‌వార‌సురాలు బ‌రిలో దిగుతోందా? అంటూ అంతా ఆస‌క్తిగా ముచ్చ‌టించుకుంటున్నారు. వీట‌న్నిటినీ మించి సుహానా ఖాన్ డేరింగ్ & డ్యాషింగ్ యాటిట్యూడ్ ప‌లుమార్లు ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌కు తావిచ్చింది. ఇదివ‌ర‌కూ రిలీజ్ చేసిన ఓ ఫోటో షూట్ యువ‌త‌రం సామాజిక మాధ్య‌మాల్లో జోరుగా వైర‌ల్ అయ్యింది. ఇంత‌కీ సుహానా 2019లో క‌థానాయిక అవుతందా.. అవ్వ‌దా? అన్న‌ది ఇప్ప‌టికి ఇంకా సస్పెన్స్.

ఈలోగానే ఈ స్టార్ కిడ్ సెన్సేష‌న్స్ కి తెర తీస్తోంది. ఇంకా స్టార్ అవ్వ‌క‌ముందే సుహానా ఓ బాంబ్ పేల్చింది. మీరు ఏ న‌టుడితో డేటింగ్ చేస్తారు? అని ఓ నెటిజ‌న్ ప్ర‌శ్నిస్తే.. (ఇన్ స్టాగ్ర‌మ్ లో ఆస్క్ మి ఎనీ థింగ్ చిట్ చాట్) తాను కొరియ‌న్ హీరో కం పాప్‌ సింగ‌ర్ కిమ్ జున్- మ్యూన్ తో డేటింగ్ కి రెడీ అని జ‌వాబిచ్చింది. ద‌క్షిణ కొరియాకి చెందిన‌ కిమ్ గొప్ప గాయ‌కుడు.. ర‌చ‌యిత‌.. న‌టుడు.. సాంగ్ రైట‌ర్.. మోడ‌ల్ .. ఆల్ రౌండ‌ర్. పైగా ఎంతో అంద‌గాడు అని సుహానా పోస్ట్ చేసిన ఫోటో ఒక‌టి రివీల్ చేసింది. కిమ్ ఫోటో చూశాక సుహానా సెల‌క్ష‌న్ కి `సాహో` చెప్పాల్సిందేన‌న్న ప్ర‌శంస‌లు కురుస్తున్నాయి. సుహానా ఎంపిక బావుంది. త‌న అభిరుచికి ఇది నిద‌ర్శ‌న‌మ‌ని అర్థ‌మ‌వుతోంది.

ఖాన్ గాళ్‌ స్పీడ్ చూస్తుంటే తాను కేవ‌లం ఒక్క బాలీవుడ్ కే ప‌రిమితం కాద‌ని, హాలీవుడ్ లో న‌టించినా ఆశ్చ‌ర్య‌పోన‌క్క‌ర్లేద‌ని మ‌నం భావించాల్సి ఉంటుంది. గ్లోబ‌ల్ వ‌రల్డ్ లో మార్కెట్ ఎక్క‌డ ఉన్నా.. అక్కడికి వెళ్లి ఒడిసిప‌ట్టుకోవ‌డం యూత్ ట్రెండ్. సుహానా ఆలోచ‌న లు స్కైలోనే ఉన్నాయి మ‌రి. ఇంత‌కీ సుహానా లండ‌న్ నుంచి ఎప్పుడు తిరిగి వ‌స్తుంది? ఎప్పుడు తొలిసినిమాకి సంత‌కం చేస్తుంది? అన్న‌ది వేచి చూడాల్సిందే. ఫ్యాన్స్ ఎంతో ఎగ్జ‌యిటింగ్ గా వెయిట్ చేస్తున్నారు.