Begin typing your search above and press return to search.

ప్రభాస్ ఇప్పుడు ఎక్కడున్నాడు?

By:  Tupaki Desk   |   23 Sep 2019 7:38 AM GMT
ప్రభాస్ ఇప్పుడు ఎక్కడున్నాడు?
X
అంచనాలు తలకిందులు చేస్తూ సాహో చాలా చాలా త్వరగా ఫైనల్ రన్ కు రావడం అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. కనీసం నెల రోజులు ఉధృతంగా ఆడుతుందనుకుంటే కేవలం రెండో వారానికే నీరసించిపోవడంతో మెయిన్ సెంటర్స్ లో తప్ప మిగిలిన చోట్ల ఎప్పుడో సాహోని షిఫ్ట్ చేశారు. దీని ఫలితం చూశాకే ప్రభాస్ రాధాకృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న జాన్ లో మార్పులు అవసరమని గుర్తించాడట.

అందుకే వాటిని చేయమని పురమాయించి ఎంచక్కా యూరోప్ లో సేదతీరేందుకు పారిస్ ఫ్లైట్ ఎక్కినట్టు తెలిసింది. పూజా హెగ్డే ఈ కారణంగానే అఖిల్ - బొమ్మరిల్లు భాస్కర్ సినిమా చేసేందుకు ఛాన్స్ దొరికింది. తగిన మార్పులతో రాధాకృష్ణ రెడీ అవ్వగానే జాన్ షూటింగ్ మళ్ళీ రీ స్టార్ట్ అవుతుంది. ప్రభాస్ ఎప్పుడు తిరిగి వస్తాడనే సమాచారం ప్రస్తుతానికి లేదు. బాహుబలి తర్వాత ఆ స్థాయి హైప్ అందుకోవడంలో సాహో తడబడటం మంచి పాఠాలే నేర్పినట్టుంది.

హంగులు బడ్జెట్ కంటే కంటెంట్ ముఖ్యమని ఇతరులు కూడా తెలుసుకునేలా సాహో ఓ లెసన్ గా నిలిచిపోతోంది. హిందీలోనే బెటర్ గా ఆడిన సాహో మిగిలిన భాషల్లో మాత్రం చేదు ఫలితాన్ని అందుకోక తప్పలేదు. జాన్ వచ్చే వేసవి విడుదలకు ప్లాన్ చేసుకున్నారు. కొత్త షెడ్యూల్ త్వరగా స్టార్ట్ అయితే టార్గెట్ రీచ్ అవ్వొచ్చు. అలా కాకుండా ఏదైనా ఆలస్యం జరిగితే మార్పు ఉండొచ్చు. దీనికి సైతం రెండు వందల కోట్ల దాకా బడ్జెట్ కేటాయించినట్టు ఇప్పటికే టాక్ ఉంది