Begin typing your search above and press return to search.

రివెంజ్ డ్రామాపై కామెడీ ఇంటర్యూ

By:  Tupaki Desk   |   22 May 2017 6:46 AM GMT
రివెంజ్ డ్రామాపై కామెడీ ఇంటర్యూ
X
యంగ్ హీరో నిఖిల్ నటించన కేశవ గత శుక్రవారం థియేటర్లలోకి వచ్చింది. రివెంజ్ డ్రామా థీమ్ తో రూపొందిన ఈ మూవీ.. ఆసక్తికర కథనంతో ఆకట్టుకుంది. కథ విషయంలో వేరే చిత్రాలను గుర్తు చేసినా.. దర్శకుడి కథనం.. హీరో యాక్టింగ్ ట్యాలెంట్.. కేశవను సక్సెస్ తీరానికి ఇప్పటికే చేర్చేశాయి.

ఇలాంటి రివెంజ్ మూవీస్ లో కామెడీని జోడించడం కష్టమే అయినా.. దర్శకుడు సుధీర్ వర్మ ఆ ఎలిమెంట్ ను కూడా బాగానే మిక్స్ చేశాడు. ఇప్పుడు ప్రమోషన్స్ విషయంలో కూడా డిఫరెంట్ స్ట్రాటజీ పాటిస్తుండడం విశేషం. ఓ ప్రముఖ ఛానల్ లోని యాంకర్ అప్పుడే తన డ్యూటీని ఫినిష్ చేసుకుని బయల్దేరుతుంటే.. వేరే యాంకర్ రాకపోవడంతో నిఖిల్ ని ఇంటర్వ్యూ చేయాల్సి వస్తుంది. సినిమాలపై పెద్దగా అవగాహన లేని ఆ యాంకర్.. నిఖిల్ ని మీ పేరేంటని అడగడం దగ్గరే కామెడీ స్టార్ట్ చేశారు. తన లాంటి హీరో పేరే తెలీని వాడితో ఇంటర్వ్యూ ఏంటని అంటాడు నిఖిల్.

ఇక ఇంటర్వ్యూ స్టార్ట్ చేసిన యాంకర్.. ఇంతకీ ఇప్పుడు రిలీజ్ అయిన సినిమా పేరేంటని అడిగినపుడు.. నిఖిల్ మరోసారి ఫ్రస్టేషన్ కు గురవుతాడు. కేశవ అంటే మంచి భక్తిరస చిత్రం చేసినట్లున్నారు కదూ అని యాంకర్ అన్నపుడు.. నిఖిల్ మొహంలో కోపం చూడాలి.. పీక్స్ అంతే. క్వింటెన్ టోరెంటినో స్థాయి రివెంజ్ డ్రామా చేశామండీ అని నిఖిల్ చెబితే.. రివెంజ్ సినిమాకు కేశవ లాంటి పేరు ఎలా పెట్టాలని అనిపించిందంటాడు యాంకర్. మొత్తం ఇంటర్వ్యూ అంతా ఇలా ఫన్నీగానే చిత్రీకరించి.. సరికొత్తగా ఆకట్టుకుంది కేశవ యూనిట్.

<br>