ఎయిర్ పోర్ట్ టెంపరేచర్ పెంచిందే

Sun Feb 17 2019 19:36:36 GMT+0530 (IST)

యాక్షన్ కానివ్వండి.. గ్లామరస్ లుక్స్ కానివ్వండి.. బోల్డ్ అప్పియరెన్స్ విషయం కానివ్వండి.. రియల్ లైఫ్ లో ఫ్యాషన్ ఐకాన్ లా కన్పించడం కానివ్వండి..  ఇలా అన్ని అంశాలు ఒకరి దగ్గర ఉండడం చాలా కష్టమైన విషయం. అలా అన్ని అంశాలు ఒకరి దగ్గర ఉంటే ఆ భామ పేరు మాత్రం కియారా అద్వాని అని చెప్పుకోవచ్చు.రీసెంట్ గా కియారా ఎయిర్ పోర్ట్ లో ఎక్కడికో వెళ్తూ బాలీవుడ్ సెలబ్రిటీ ఫోటోగ్రాఫర్ల కెమెరా కంటికి చిక్కింది.  ఇంతకీ అమ్మడు ఎక్కడికి వెళ్తుందో ఏమో తెలియదు కానీ ఓ ఫ్యాషనిస్టా రేంజ్ లో ఉంది..  పింక్ కలర్ స్వెట్ షర్ట్.. అలాంటి రంగుదే మ్యాచింగ్ ప్యాంట్.. దానికి మరింతగా మ్యాచ్ అయ్యేలా బ్రౌన్ కలర్ షూలో దర్శనమిచ్చిన భామ చూపరుల మతులు పోగొట్టింది.  పోనీటెయిల్ వేసుకొని.. కళ్ళకు గాగుల్స్ పెట్టుకొని స్టైల్ అంతా నాదే అన్నట్టుగా ఒక గ్రే కలర్ హ్యాండ్ బ్యాగ్ ను పట్టుకొని ఊపుకుంటూ.. భలే చిరునవ్వు నవ్వింది.

ఇక పాప ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయానికి వస్తే 'అర్జున్ రెడ్డి' హిందీ రీమేక్ 'కబీర్ సింగ్' లోనూ.. 'గుడ్ న్యూస్' లోనూ నటిస్తోంది. ఈ రెండు ప్రాజెక్టులు కాకుండా తమిళం ఒక స్టార్ హీరో ప్రాజెక్టుకు హీరోయిన్ గా పరిశీలిస్తున్నారట.