Begin typing your search above and press return to search.

నాకు లైఫిచ్చింది సునీల్ -నాని

By:  Tupaki Desk   |   14 Dec 2017 4:37 AM GMT
నాకు లైఫిచ్చింది సునీల్ -నాని
X
ఎలాంటి పాత్రయినా సరే అలవోకగా చేసుకుంటూ వెళ్లిపోవడం నాచురల్ స్టార్ నాని స్పెషాలిటీ. ముఖ్యంగా నాని డైలాగ్ డెలివరీని ఇష్టపడే ఫ్యాన్స్ బోలెడు మంది ఉన్నారు. అలాంటి నాని ఒకప్పుడు అసలు మాట మాట్లాడటాననికే భయపడిపోయి దూరంగా నిలుచుండిపోయేవాడంటే నమ్మలేకపోవచ్చు. కానీ ఓ రకంగా తనకు లైఫిచ్చింది.. సినిమా రంగంలో పైకి రావడానికి సహాయం చేసింది సునీల్ అని నాని చెప్పుకొచ్చాడు.

హీరో కావడానికి ముందు నాని అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాడు. శ్రీను వైట్ల దర్శకత్వంలో విష్ణు హీరోగా నటించిన సూపర్ హిట్ మూవీ ఢీకి కూడా నాని అసిస్టెంట్ డైరెక్టర్ గా వ్యవహరించాడు. ఈ సినిమాకు తనను రికమండ్ చేసింది కూడా సునీలేనని నాని ఓ కొత్త సంగతి బయటపెట్టాడు. సునీల్ హీరోగా నటించిన టూ కంట్రీస్ సినిమా రిలీజ్ కు సిద్ధమవుతోంది. ఈ మూవీ ఆడియో రిలీజ్ ఫంక్షన్ లో నాని తన ఫ్లాష్ బ్యాక్ రోజుల గురించి చెప్పుకొచ్చాడు. ‘‘కొత్తగా వచ్చిన అసిస్టెంట్ డైరెక్టర్ ని కావడంతో చొరవగా యాక్టర్ల దగ్గరకు వెళ్లి మాట్లాడలేకపోయేవాడిని. అసలు మాట్లాడొచ్చో.. మాట్లాడకూడదదో తెలియని భయం ఉండేది. అప్పటికే సునీల్ ఫేమస్ యాక్టర్. అలాంటి నాతో క్లోజ్ గా.. ఫ్రెండ్లీగా ఉండి నాలో కాన్ఫిడెన్స్ నింపిన ఫస్ట్ యాక్టర్ సునీల్ అన్న’’ అంటూ అతడికి థ్యాంక్యూ చెప్పాడు.

‘‘ఈ ఆడియో రిలీజ్ ఈవెంట్ కు ఆడియన్స్ తో సమానంగా గెస్టులు కనిపిస్తున్నారు. దీనిని బట్టి సునీల్ కు ఇండస్ట్రీలో ఎంతమంది ఫ్రెండ్స్ అండ్ వెల్ విషర్స్ ఉన్నారో అర్ధం చేసుకోవచ్చు. అన్ని సినిమాలు బాగా ఆడాలి. ఇది మా సునీలన్న సినిమా కాబట్టి ఇంకా బాగా ఆడాలని కోరుకుంటున్నా’’ అంటూ టూ కంట్రీస్ టీంకు తన బెస్ట్ విషెస్ చెప్పాడు నాని.