Begin typing your search above and press return to search.

ఖైదీ కౌగిలిలో ఒదిగిపోయిన బాహుబలి

By:  Tupaki Desk   |   21 Oct 2016 4:59 PM GMT
ఖైదీ కౌగిలిలో ఒదిగిపోయిన బాహుబలి
X
ఒకేచోట షూటింగ్ లు జరుగుతుంటే.. అత్మీయ కలయికలకు కొదవ ఉండదు. ఇదిలా ఉంటే.. చాలాకాలం తర్వాత తన 150 సినిమాకు ముఖానికి మేకప్ వేసుకున్న మెగాస్టార్.. తన చిత్ర షూటింగ్ ను శరవేగంగా చేస్తున్నారు. ఖైదీ నెంబరు 150గా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయాలన్న తపనతో పని చేస్తున్నారు. కత్తికి రీమేక్ గా చేస్తున్న ఈ చిత్రానికి వి.వి. వినాయక్ దర్శకత్వం వహిస్తున్నారు.

ఇదిలా ఉంటే.. ఈ షూటింగ్ సందర్భంగా తన సన్నిహితుల్ని.. ఆత్మీయుల్ని ఆహ్వానిస్తున్న మెగాస్టార్.. తాజాగా బాహుబలి టీంను ఆహ్వానించారు. ఇండియన్ స్ర్కీన్ మీద రికార్డులు సృష్టిస్తూ.. తెలుగు సినిమా రేంజ్ ను ఎక్కడికో తీసుకెళ్లిన బాహుబలి ది కంక్లూజన్ షూటింగ్ వేగంగా సాగుతున్న సంగతి తెలిసిందే. ఖైదీ సెట్ కు వచ్చిన బాహుబలి ప్రభాస్.. చిత్ర దర్శకుడు రాజమౌళిని సాదరంగా ఆహ్వానించారు.

ఈ సందర్భంగా మెగాస్టార్ ను ప్రభాస్ ఆత్మీయంగా హత్తుకున్నారు. ఖైదీ కౌగిలిలో ఒదిగిపోయిన బాహుబలిని చూసిన చాలామంది అలా చేస్తుండిపోయారు. పరస్పరం ప్రేమాభిమానులు ఇచ్చి పుచ్చుకోవటం తెలుగు సినిమాలో ఎప్పటి నుంచో వస్తున్నదే అయినా.. అలాంటికల్చర్ ఇప్పట్లో మిస్ కాదన్నట్లుగా ఇలాంటి సంఘటనలు స్పష్టం చేస్తుంటాయని చెప్పాలి.