Begin typing your search above and press return to search.

రానా క‌థ‌కు పేరేంటీ?

By:  Tupaki Desk   |   24 Feb 2018 10:17 AM GMT
రానా క‌థ‌కు పేరేంటీ?
X
బాహుబ‌లికి ముందు రానా వేరు... బాహుబ‌లి త‌రువాత రానా వేరు. భ‌ల్లాల‌దేవుడిగా ప్ర‌పంచ‌స్థాయి గుర్తింపు తెచ్చుకున్నాడు. అప్ప‌ట్నించి చాలా బిజీ కూడా అయిపోయాడు. అయినా ఏ సినిమాలు ప‌డితే ఆ సినిమాలు ఒప్పుకోకుండా చాలా జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నాడు. అతిధిగా సెమినార్ల‌కు, మీటింగుల‌కు ఆహ్వానాలు కూడా రానాకు బాగానే అందుతున్నాయి. ఇదిగో ఇప్పుడు ఫిక్కీ లేడీస్ ఆర్గ‌నైజేష‌న్ వారు ఏర్పాటు చేసిన ఆర్ట్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ కార్య‌క్ర‌మానికి అతిధిగా వెళ్లి ఎన్నో క‌బుర్లు చెప్పాడు.

ఎక్క‌డకెళ్లిన బాహుబ‌లి సినిమాను ప్ర‌స్తావించ‌కుండా ఉండ‌లేడు రానా. ఇక్క‌డ కూడా బాహుబ‌లి సినిమాను తెగ పొగిడాడు. సినిమాల‌ను చూసే కోణాన్ని బాహుబ‌లి మార్చేసింద‌ని... ఈ సినిమా వ‌ల్ల స్టోరీ టెల్లింగ్ కూడా బాగా పెరిగింద‌ని అంటున్నాడు. స్టోరీ టెల్లింగ్ ను సినిమాలు నిల‌బెడుతున్నాయ‌ని అన్నారు. సినిమా ద్వారా - షార్ట్ ఫిల్మ్ ల ద్వారా - టీవీల ద్వారా - వెబ్ సిరీస్ ల ద్వారా ... ర‌క‌ర‌కాలుగా క‌థ‌లు చెప్ప‌డం అనే ప‌ద్ద‌తి బతుకుతోంద‌ని అన్నారు. రానా చెప్పిన విష‌యాలు విన్నాక‌... స‌మావేశానికి వ‌చ్చిన అనేక ప్ర‌శ్న‌లు అడిగారు. వాటికి రానా చాలా ఓపిక‌గా స‌మాధానం చెప్పారు.

స‌భ‌లోని ఒక వ్య‌క్తి ఏదో ఒక రోజు మీ క‌థ చెప్పాల్సి వ‌స్తే... ఆ క‌థ‌కు ఏ టైటిల్ పెడ‌తారు అని అడిగారు. దానికి రానా స్టోరీ టెల్ల‌ర్ అన్న స‌మాధానం ఇచ్చారు. చాలా స్పాంటేనియ‌స్ గా మాట్లాడ‌గ‌ల‌న‌ని రానా నిరూపించుకున్నాడు.