రియల్ లైఫ్ లో F2 కు రివర్స్ అంటున్న వెంకీ

Wed Jan 16 2019 12:33:01 GMT+0530 (IST)

సీనియర్ స్టార్ హీరో వెంకటేష్ ఎప్పుడూ తన కుటుంబం గురించి గానీ ఇతర పర్సనల్ విషయాలు గానీ మాట్లాడేందుకు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడు.  ముఖ్యంగా తన వైఫ్ గురించి ఇన్నేళ్ళలో ఎప్పుడూ మాట్లాడిందే లేదు.  కానీ మొదటిసారి అయన భార్యతో తనకున్న అనుబంధం గురించి ఓపెన్ అయ్యాడు.'F2' సక్సెస్ తో ఫుల్ జోష్ మీద ఉన్న వెంకీ ఈమధ్య ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన వైఫ్ తో లైఫ్ వండర్ఫుల్ గా ఉందని అన్నాడు.  ఇంట్లో భార్య లేకపోతే భర్తలు రెచ్చిపోతుంటాడని అంటూ ఉంటారు కానీ తన విషయంలో అది రివర్స్ అని చెప్పాడు.  "మా ఆవిడ పక్కనుంటే చాలా ఆనందం.  ఆమె పక్కనుంటే నేను రెచ్చిపోతాను" అన్నాడు.   ప్రతి రోజు ఆమెకు తప్పని సరిగా కొత్త సమయం కేటాయిస్తానని తెలిపాడు. కలిసి భోజనం చేస్తామని.. అప్పుడప్పుడూ రెస్టారెంట్లకు వెళ్తుంటామని తెలిపాడు.  'F2' లో తన పాత్రను అంతలా ఎంజాయ్ చేస్తూ నటించడానికి కారణం తనభార్య అంటూ క్రెడిట్ ఆవిడకే ఇచ్చేశాడు.

'F2' లో భార్యాబాధితుడిగా ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తిన వెంకీ కామెడి టైమింగ్ కు నటనకు ప్రేక్షకులు జేజేలు పలుకుతున్నారు. వరుణ్ తేజ్ కూడా చక్కగా నటించినప్పటికీ సినిమాలో వెంకీ డామినేషన్ క్లియర్ గా కనిపించింది.