Begin typing your search above and press return to search.

సిఫార్సులు చేస్తున్న నృత్యదర్శకుడు!

By:  Tupaki Desk   |   22 Feb 2019 8:04 AM GMT
సిఫార్సులు చేస్తున్న నృత్యదర్శకుడు!
X
టాలెంట్ అని.. స్వయంకృషి అని లక్షా తొంభై మాటలు పైకి చెప్పే జనాలే అలాంటివారికి కాకుండా రెకమెండేషన్ తో వచ్చిన వాళ్లకు అవకాశాలు ఇస్తారు. వీళ్ళు కూడా కొంతమందిని ఇతరులకు రెకమెండ్ చేస్తారు. అయినా చాలా విషయాల్లో ఈ సిఫార్సులే ప్రముఖ పాత్ర పోషిస్తాయి. అంతెందుకు..ఇలాంటి రెకమెండేషన్ బ్యాచ్ వల్ల ఈ మధ్య ఒక మీడియా సంస్థలో క్వాలిటీ తగ్గిందనే రూమర్లు కూడా బయట జోరుగా ఉన్నాయి.

మరి సిఫార్సులు లోకసహజం అయినప్పుడు ఫిలిం ఇండస్ట్రీలో కూడా ఉంటాయి కదా. ఈమధ్య ఒక ప్రముఖ కొరియోగ్రాఫర్ 'స్పెషల్' షో లో కలిసి పనిచేయడం వల్ల ఇద్దరు హీరోయిన్లతో బాగా క్లోజ్ అయ్యాడట. సదరు నృత్యదర్శకుడు స్టార్ హీరోల సినిమాలకు పనిచేసే వ్యక్తి కావడంతో మంచి పరిచయాలు ఉన్నాయి. ఆ పరిచయంతోనే తనకు క్లోజ్ అయిన హీరోయిన్లలో ఒక హీరోయిన్ పేరును స్టార్ హీరోకు సిఫార్సు చేయడం జరిగిందట. "మీ సినిమాలో కనీసం మూడో హీరోయిన్ గా అయినా ఆ బ్యూటీకి ఒక రోల్ ఇవ్వండి" అని అడిగడంతో ఆ స్టార్ హీరో అవాక్కయ్యాడట. ఆ హీరోయిన్ కు ప్రతిభ ఉన్నా.. ఈయన గారు ఎందుకు రికమెండ్ చేస్తున్నాడని ఆలోచనలో పడిపోయాడని ఫిలిం నగర్లో రూమర్లు గుప్పుమంటున్నాయి..

మరి ఈ కొరియోగ్రాఫర్ కు ఆ హీరోయిన్ కు మధ్య ఉండేది జస్ట్ ఫ్రెండ్షిప్పేనా.. లేదా ఫ్రీక్వెన్సీ ఏమైనా మ్యాచ్ అయిందా అనేది మాత్రం ఇంకా తెలియదు. నిజంగా ప్రతిభను ప్రోత్సహించే సదుద్దేశం అయితే మాత్రం మంచిదే కదా..!