Begin typing your search above and press return to search.

మహేష్‌ వాట్సాప్ ఫోటో నాకు తెలియదు

By:  Tupaki Desk   |   26 Jun 2017 11:12 AM GMT
మహేష్‌ వాట్సాప్ ఫోటో నాకు తెలియదు
X
ఇప్పుడు కమెడియన్ వెన్నెల కిషోర్ బాగా బిజీ అయిపోయాడు. మనోడు ఎక్కడికెళ్ళినా కూడా జనాలు బ్రహ్మరథం పడుతున్నారు. అలాగే కిషోర్ కూడా వరుసగా ప్రతీ సినిమాతోనూ తన క్యారెక్టర్ తో హిట్టు కొట్టేస్తున్నాడు. సినిమా ఆడకపోయినా కూడా అందులో వెన్నెల కిషోర్ క్యారెక్టర్ బాగా పండుతోంది. అందుకే ఇప్పుడు ఆ క్రేజ్ ను తట్టుకోవడం కష్టం అంటున్నాడు ఈ కమెడియన్.

ఎందుకంటే మనోడు ఎక్కడికి వెళ్ళినా కూడా అందరూ మహేష్‌ బాబు వాట్సాప్ ఫోటో ఏముంటుంది అని అడుగుతున్నారట. నిజానికి దూకుడు సినిమాలో నటించాకే వెన్నెల కిషోర్ కు మాంచి బ్రేకొచ్చింది. ఆ సినిమాలో శాస్ర్తి పాత్రలో మహేష్‌ తో మనోడు మాంచి టైమింగ్ మెయిన్టయిన్ చేశాడు. అయితే ఆ పాత్రను చేసిన తీరు చూస్తే.. మనోడు మహేష్‌ తో పిచ్చ క్లోజ్ అనే అనిపిస్తుంది. అందుకే అందరూ మహేష్‌ గురించి చెప్పమని అడుగుతున్నారు. ''నిజానికి ఆ సినిమా షూటింగ్ టైములో నేను మహేష్‌ గారితో రెండే ముక్కలు రోజూ మాట్లాడేవాడ్ని. గుడ్ మార్నింగ్ సార్. బాయ్ సార్. అంతే. ఆయన నెంబర్ కూడా నాకు తెలియదు. నేను అడిగే ధైర్యమూ చేయలేదు'' అంటూ సెలవిచ్చాడు కిషోర్.

మొత్తానికి స్టార్డమ్ అంటే ఈ విధంగా తన గురించే కాకుండా తను పనిచేసిన స్టార్ల గురించి కూడా చెప్పమని అందరూ అడుగుతూ ఉంటారు మరి. ఏదేమైనా కూడా ఇప్పుడు వెన్నెల కిషోర్ బ్రహ్మానందం అండ్ సునీల్ తరహాలో చాలా సినిమాలకు పునాది అయిపోతున్నాడు. అది సంగతి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/