Begin typing your search above and press return to search.

వెంకీ మామ కూడా సంక్రాంతికే వస్తే?

By:  Tupaki Desk   |   15 Oct 2019 5:33 AM GMT
వెంకీ మామ కూడా సంక్రాంతికే వస్తే?
X
చాలా కాలంగా తెలుగు ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్న మామ అల్లుడు మల్టీస్టారర్‌ చిత్రం 'వెంకీ మామ' విడుదలకు సిద్దం అవుతోంది. సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం సినిమా షూటింగ్‌ దాదాపుగా పూర్తి అయ్యింది. మంచి విడుదల తేదీ కోసం నిర్మాత సురేష్‌ బాబు వెయిట్‌ చేస్తున్నాడు. క్రిస్మస్‌ కానుకగా ఈ చిత్రంను విడుదల చేస్తారనే ప్రచారం జరిగింది. కాని పోటీ తీవ్రంగా ఉన్న నేపథ్యంలో సినిమాను వచ్చే ఏడాదికి షిప్ట్‌ చేశారని కూడా వార్తలు వస్తున్నాయి.

ఇక ఇప్పుడు సంక్రాంతి కానుకగా 'వెంకీమామ' చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. వెంకటేష్‌ గత చిత్రం 'ఎఫ్‌ 2' సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఫ్యామిలీ ఆడియన్స్‌ కు కనెక్ట్‌ అయ్యేలా ఉన్న ఈ చిత్రం సంక్రాంతికి వస్తేనే బాగుంటుందని ప్రేక్షకులు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వెంకీ మామ విడుదల విషయమై ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన అయితే రాలేదు.

సంక్రాంతికి మహేష్‌ బాబు 'సరిలేరు నీకెవ్వరు'.. అల్లు అర్జున్‌ 'అల వైకుంఠపురంలో' చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ రెండు చిత్రాలతో పాటు కళ్యాణ్‌ రామ్‌ 'ఎంత మంచివాడవురా' చిత్రం కూడా సంక్రాంతి బరిలో నిలవబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ మూడు సినిమాలతో వెంకీ మామ కూడా వస్తాడా అనేది చూడాలి. సంక్రాంతి సీజన్‌ కు ఎన్ని సినిమాలు వచ్చినా పాజిటివ్‌ టాక్‌ ను దక్కించుకుంటే ఖచ్చితంగా మంచి వసూళ్లను రాబడుతాయి. అందుకే ఈ సంక్రాంతికి నాలుగు సినిమాలు వచ్చినా పర్వాలేదు అన్నట్లుగా విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.