Begin typing your search above and press return to search.

సెక్స్ ఎడ్యుకేషన్ రీమేక్ ఏమైందబ్బా?

By:  Tupaki Desk   |   15 Dec 2017 6:30 AM GMT
సెక్స్ ఎడ్యుకేషన్ రీమేక్ ఏమైందబ్బా?
X
బాలక్ పాలక్ అంటూ.. ఐదేళ్ల క్రితం మరాఠీలో ఓ మూవీ వచ్చింది. సెక్స్ కోసం తెగ పరితపించిపోయే కుర్రాళ్లలో మార్పు తెచ్చేందుకు ఓ అమ్మాయి ఎలాంటి ప్రయత్నాలు చేసిందన్నదే ఈ సినిమా కాన్సెప్ట్. స్టైల్ గా చెప్పుకోవాలంటే.. సెక్స్ ఎడ్యుకేషన్ బ్యాక్ డ్రాప్ అన్నమాట.

తెలుగులో ఈ సినిమా రీమేక్ చేసేందుకు గట్టి ప్రయత్నాలే జరిగాయి. ఆరు నెలలకు ముందు సినిమాపై అధికారిక ప్రకటనే కాదు.. క్యాస్టింగ్ గురించిన సంగతులు కూడా చెప్పారు. బాలక్ పాలక్ రీమేక్ లో నటిస్తున్నానని చెప్పింది తెలుగమ్మాయి తేజస్వి మదివాడ. అంతే.. ఆ తర్వాత మళ్లీ ఈ సినిమా కబుర్లేవీ వినిపించడం లేదు. పలువురు నటీనటుల ఎంపికను కూడా పూర్తి చేసి.. ఇక సెట్స్ పైకి వెళ్లడమే ఆలస్యం అనుకున్న సమయంలో.. అసలు ప్రాజెక్టు గురించిన మాటా మంతీ వినిపించకపోవడం ఆశ్చర్యకరం.

కనీసం ఈ మూవీకి సైన్ చేసిన వాళ్లకు కూడా ఎలాంటి అప్ డేట్స్ లేవట. మేకర్స్ నుంచి ఎలాంటి న్యూస్ వినిపించడం లేదని.. అసలు టచ్ లోకి కూడా రావడంలేదని పలువురు చెబుతున్నారు. చూస్తుంటే.. ఈ సెక్స్ ఎడ్యుకేషన్ సినిమాను పక్కన పెట్టేసినట్లే అనే టాక్ వినిపిస్తోంది. కుర్రకారును ఆకట్టుకునే సినిమా చేయాలన్న తేజస్వి టార్గెట్ నెరవేరేట్లుగా కనిపించడం లేదు.