Begin typing your search above and press return to search.

చిరును చూసి అలా డిసైడ్ అయిన సుదీప్!

By:  Tupaki Desk   |   18 Sep 2019 6:51 AM GMT
చిరును చూసి అలా డిసైడ్ అయిన సుదీప్!
X
కన్నడ స్టార్ హీరో సుదీప్ సౌత్ లో మంచి గుర్తింపే ఉంది. 'ఈగ'.. 'బాహుబలి' చిత్రాలతో సుదీప్ కు ఆ గుర్తింపు వచ్చింది. రీసెంట్ గా 'పహిల్వాన్' అనే బహు భాషా చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు కానీ ఆ సినిమా తెలుగు ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. అయితే సుదీప్ మరోసారి 'సైరా' తో ఆడియన్స్ ను మెప్పించేందుకు రెడీ అవుతున్నాడు. మెగాస్టార్ చిరంజీవి నటించిన 'సైరా' లో సుదీప్ ఒక కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.

రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో సుదీప్ ను "మెగాస్టార్ చిరంజీవితో కలిసి పనిచేశారు. మీరు చిరును చూసి ఏం నేర్చుకున్నారు?" అని అడిగితే.. రెగ్యులర్ గా కాకుండా విభిన్నంగా స్పందించారు. చిరంజీవి గారిని చూసి రాజకీయాలోకి రాకూడదని డిసైడ్ అయ్యానని చెప్పారు. "చిరంజీవిని చూసి ఎటువంటి పరిస్థితుల్లో కూడా రాజకీయాల్లోకి పోకూడదని నిర్ణయించుకున్నా. పదేళ్ళ కాలం చాలా విలువైనది. నాకు రాజకీయ పార్టీల నుండి ఆహ్వానాలు అందాయి.. కానీ నేను వాటిని నిరాకరించాను. ఒక్కసారి రాజకీయాల్లోకి వెళ్తే మనకు ఒక పార్టీ ముద్ర వేస్తారు. మన పరిధిని తగ్గిస్తారు. అయితే నటుడిగా అలాంటి పరిమితులు ఉండవు. మనల్ని అందరూ అభిమానిస్తారు" అంటూ తన వెర్షన్ వినిపించారు.

చిరు నుంచి ఏం నేర్చుకున్నారు అంటే కష్టపడే తత్త్వం.. గౌరవంగా ప్రవర్తించడం.. ఎంత ఎత్తుఎదిగినా వినయంగా ఉండడం.. లాంటివి చెప్తారు. కానీ సుదీప్ మాత్రం పాలిటిక్స్ లో చిరు ఫెయిల్యూర్ తనకు పాఠం అంటున్నాడు. సెలబ్రిటీలు సహజంగా ఇలాంటి అంశాలను ప్రస్తావించరు.. కానీ సుదీప్ మాత్రం ఎవరేమనుకుంటారో అనేది ఆలోచించకుండా ఓపెన్ గా చెప్పేయడం కాస్త వింతే. ఏదేమైనా సుదీప్ చెప్పిన విషయంలో లాజిక్ అయితే ఉంది.