Begin typing your search above and press return to search.

ఇంతకీ ఆ సినిమాల రిజల్టేంటి?

By:  Tupaki Desk   |   28 Oct 2016 7:30 PM GMT
ఇంతకీ ఆ సినిమాల రిజల్టేంటి?
X
తెలుగులో ఈ వీకెండ్ నాలుగు సినిమాలు షెడ్యూలయ్యాయి. అందులో రెండు తమిళ డబ్బింగ్ సినిమాలే. కాష్మోరాకు యావరేజ్ టాక్ వచ్చింది. ధనుష్ మూవీ ‘ధర్మయోగి’ సంగతేంటో శనివారం తేలుతుంది. తెలుగు సినిమాలు మిస్టర్ 420.. చల్ చల్ గుర్రం ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించలేదు. ఐతే తెలుగు రాష్ట్రాల ప్రేక్షకుల్ని ఈ వీకెండ్ రెండు హిందీ సినిమాలు కూడా బాగానే ఆకర్షించాయి. అవే.. యే దిల్ హై ముష్కిల్.. శివాయ్.

వీటిలో కరణ్ జోహార్ దర్శకత్వం వహించిన ‘యే దిల్ హై ముష్కిల్’ చాన్నాళ్లుగా చర్చనీయాంశం అవుతోంది. ఐశ్వర్యారాయ్-రణబీర్ ల రొమాన్స్.. పాక్ నటులకు సంబంధించిన వివాదంతో ఈ సినిమా హాట్ టాపిక్ అయింది. సినిమాకు ఓపెనింగ్స్ భారీగా వచ్చాయి. టాక్ కూడా బాగానే ఉంది. కరణ్ నుంచి చాన్నాళ్ల తర్వాత వచ్చిన ఇంటెన్స్ లవ్ స్టోరీగా దీన్ని చెబుతున్నారు. ఐతే కరణ్ బ్లాక్ బస్టర్ల స్థాయికి మాత్రం ఇది చేరేలా కనిపించట్లేదు. సినిమా మాత్రం బాగుందనే అంటున్నారు. రణబీర్.. అనుష్క.. ఐశ్వర్యల పెర్ఫామెన్స్ అదుర్స్ అని చెబుతున్నారు. హీరోయిన్లద్దరితో రణబీర్ రొమాన్స్ బాగానే పండించాడు. ఐశ్వర్య పాత్ర మరీ అంత హాట్ గా ఏమీ లేదట.

ఇక మరో హిందీ సినిమా ‘శివాయ్’కు డిజాస్టర్ టాక్ వస్తోంది. దీనికి ఎవ్వరూ 2కు మించి రేటింగ్ ఇవ్వట్లేదు. యాక్షన్ ఎపిసోడ్లు.. విజువల్స్ అద్భుతంగా ఉన్నా.. సినిమా మాత్రం ప్రేక్షకులకు రుచించట్లేదు. ఈ సినిమా చెత్త అంటూ కమల్.ఆర్.ఖాన్ అంటే ఏదో అనుకున్నారు కానీ.. అతడి మాటలకు తగ్టట్లే ప్రేక్షకులు కూడా స్పందిస్తున్నారు.