Begin typing your search above and press return to search.

కాంతలను ఇలా పసిగట్టేస్తున్నారు

By:  Tupaki Desk   |   23 May 2017 6:38 AM GMT
కాంతలను ఇలా పసిగట్టేస్తున్నారు
X
ఓ మూవీకి క్యాస్టింగ్ కంప్లీట్ చేయడం అంటే చిన్న విషయం కాదు. తమ కథలోని పాత్రకు తగ్గట్లుగా నటులను ఎంపిక చేసుకోవడం పెద్ద ప్రహసనమే. హీరో బేస్డ్ గా కథలు రాసుకుంటున్నారు కాబట్టి.. అక్కడ సమస్య రాకపోయినా.. హీరోయిన్ దగ్గరకు వచ్చేసరికి చాలాసార్లు చిక్కులు ఎదురవుతున్నాయి. కొత్త అమ్మాయిలను.. ఫ్రెష్ ట్యాలెంట్ ను వెతుక్కొచ్చి మరీ సినిమాల్లో చూపిస్తున్నారు మేకర్స్.

మోడలింగ్ నుంచి ఎక్కువ మంది భామలను తీసుకుస్తున్నారు దర్శకులు. కృష్ణగాడి వీర ప్రేమగాధలో నటించిన మెహ్రీన్ కౌర్ ను అలాగే గుర్తించాడు హను రాఘవపూడి. హెబ్బా పటేల్ కూడా మోడలింగ్ నుంచి వచ్చిన భామే. సోనారికా భడోరియా.. అవికా గోర్‌ లను హిందీ సీరియల్స్ నుంచి తీసుకొచ్చారు మేకర్స్. వీరంతా అప్పటికే కెమెరా ముందు నటించడం.. దర్శక నిర్మాతలకు అడ్వాంటేజ్. ఇక న్యూస్ పేపర్లు- పార్టీలు- పెళ్లిళ్లు కూడా హీరోయిన్ల ఎంపికకు వేదికలు అవుతాయంటే ఆశ్చర్యం వేయక మానదు.

ఆర్తి అగర్వాల్ ను ఓ హిందీ పేపర్ యాడ్ ను చూసి గుర్తించారు నిర్మాత సురేష్ బాబు. రియా చక్రవర్తిని ఓ పార్టీకి సంబంధించిన ఫోటోలో చూసి తీసుకొచ్చారు నిర్మాత ఎంఎస్ రాజు. ఓ మేగజైన్ కవర్ పేజ్ మెరిసిన హంసా నందిని.. దర్శకుడు వంశీని ఆకర్షించింది. దర్శుడు ఈ.సత్తి బాబు రిచా పనాయ్ ను ఓ పార్టీ పేజ్ లోనే చూశారు. అప్పటికే తెలుగు సినిమాలో నటించినా.. ఓ ఇంగ్లీష్ పేపర్ లో కేథరిన్ థ్రెసాను చూసి ఎర్రబస్ మూవీలోకి తీసుకున్నారు దాసరి.

సోషల్ మీడియా కూడా ఇప్పుడు క్యాస్టింగ్ ను కంప్లీట్ చేసే సాధనం అవుతోంది. ఫేస్ బుక్ లో ఈషా రబ్బాను చూసిన దర్శకుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణ.. అంతకుముందు- ఆ తర్వాత సినిమా చేశాడు. తుంటరి చిత్రంలో నటించిన లతా హెగ్డేను కూడా ఫేస్ బుక్ లోనే గుర్తించాడు కుమార్ నాగేంద్ర. అనుకోకుండా అనే షార్ట్ ఫిలిం ద్వారా ఫేమ్ సంపాదించుకున్న రీతు వర్మ ఇప్పుడు ఏ స్థాయిలో ఉందో చూస్తున్నానం. చాందినీ చౌదరి కూడా యూట్యూబ్ సెన్సేషన్ గానే సినిమాల్లోకి వస్తోంది.

కాఫీ షాప్స్.. మోడలింగ్ ఏజన్సీస్.. కాలేజ్ ఫెస్ట్.. సోషల్ మీడియా.. ఫ్యాషన్ షోస్.. సోప్ ఒపెరాస్.. ఇలా అనేక ప్లాట్ ఫామ్స్ లో అందాల భామలను వెతికేస్తుంటామని చెబుతున్నారు క్యాస్టింగ్ డైరెక్టర్స్.