Begin typing your search above and press return to search.

టీజర్ టాక్: ఫుల్ యాక్షన్ లో దిగిన టైగర్ - హృతిక్

By:  Tupaki Desk   |   15 July 2019 6:26 AM GMT
టీజర్ టాక్: ఫుల్ యాక్షన్ లో దిగిన టైగర్ - హృతిక్
X
బాలీవుడ్ స్టార్స్ హృతిక్ రోషన్.. టైగర్ ష్రాఫ్ నటిస్తున్న మల్టి స్టారర్ ఫిలిం 'వార్'. యష్ రాజ్ ఫిలిమ్స్ ఆదిత్య చోప్రా నిర్మాణంలో.. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. తాజాగా ఈ సినిమా టీజర్ విడుదలైంది. 53 సెకండ్ల నిడివి ఉన్న ఈ టీజర్ లో యాక్షన్ పీక్స్ లో ఉంది.

టీజర్ ఆరంభంలోనే లాంగ్ షాట్ లో టైగర్.. హృతిక్ ఇద్దరూ స్పోర్ట్స్ బైక్స్ లో ఒక హై ఎండ్ చేజ్ సీక్వెన్స్ లో కనిపిస్తారు. నెక్స్ట్ షాట్ లో టిపికల్ యాక్షన్ హీరోల అవతారంలో హృతిక్.. టైగర్ ల ఇంట్రో ఉంది. హృతిక్ Vs టైగర్ అంటూ పోటాపోటీగా ఇద్దరూ బైక్ స్టంట్స్ చేయడం చూపించారు. ఈ ఇద్దరూ మాచో హీరోలతో పాటుగా ఒక బీచ్ ఒడ్డున పింక్ బికినిలో ఖజురహో శిల్పం లాగా పోజుస్తూ ఉన్న సెక్సీ బ్యూటీ వాణి కపూర్ ను కూడా చూపించారు. మధ్యలో ఒకటి ఆరా సాంగ్ బిట్స్ ను చూపించినా.. టీజర్ అంతా ఫుల్ యాక్షన్ ఉంది.. బిల్డింగులపై రన్నింగ్.. కార్లను బొమ్మ కార్లలాగా తిప్పుతూ గన్ ఫైట్.. బ్లాస్టులు..మిలిటరీ వెహికల్స్.. మెషీన్ గన్స్ తో షూటింగ్.. హెలికాప్టర్ నుంచి దూకేయడం.. మిస్సైల్స్ డ్రాప్ చేయడం.. ఇలా అన్నీ ఉన్నాయి.

ఈ టీజర్ లో హైలైట్ మాత్రం హృతిక్ బైక్ లో పోతూ ఉంటే టైగర్ జంప్ చేస్తూ హృతిక్ ను బైక్ నుంచి లాగేసి అద్దాలు పగలగొట్టుకుంటూ పడిపోవడం. టైగర్ అసలే జిమ్నాస్ట్.. హృతిక్ కూడా యాక్షన్ స్టంట్స్ కు పెట్టింది పేరు.. ఇద్దరూ కలవడంతో రచ్చగా ఉంది ఈ టీజర్. యాక్షన్ ప్రియులైన ప్రేక్షకులకు మాసాలా దట్టించిన స్పైసీ బిర్యానిలా ఉంది. 'వార్' చిత్రాన్ని అక్టోబర్ 2 న విడుదల చేస్తామని రిలీజ్ డేట్ కూడా వెల్లడించారు. ఆలస్యం ఎందుకు చూసేయండి.. ఈ యాక్షన్ ఫీస్ట్.