హీరోయిన్ పై 7 ఏళ్ల క్రితం చేసిన హాట్ కామెంట్స్ ఇప్పుడు వైరల్

Thu Apr 25 2019 07:00:01 GMT+0530 (IST)

సౌత్ తో పాటు - బాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితం అయిన అయేషా టకియా ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటుంది. పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంను ఆనందంగా గడుపుతుంది. ఇలాంటి సమయంలో అయేషా టకియా గురించి ఒక కమెడియన్ ఏడు సంవత్సరాల క్రితం మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కమెడియన్ వరుణ్ గ్రోవర్ ఏడు సంవత్సరాల క్రితం ఒక కార్యక్రమంల్లో పాల్గొన్న సమయంలో మాట్లాడుతూ అమితాబచ్చన్ గారు ఏ సినిమాలో చూసిన కనిపిస్తున్నారు - అయేషా టకియా వక్షోజాల మాదిరిగా అంటూ నవ్వించే ప్రయత్నం చేశాడు.ఇప్పుడు ఆ వీడియోను దర్శకుడు అశోక్ పండిట్ ట్విట్టర్ లో షేర్ చేశాడు. అంతా మర్చి పోయిన ఆ వీడియోను ఇప్పుడు ఈయన ఎందుకు ట్వీట్ చేశాడా అంటూ అంతా అవాక్కవుతున్నారు. మరో వైపు ఈ వీడియో చూసిన తర్వాత కమెడియన్ వరుణ్ గ్రోవర్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఆడవారి పై కామెంట్స్ చేయడం - వారిని చిన్న చూపు చూస్తూ మాట్లాడటం కామెడీ అనుకునే నీచుడు వరుణ్ గ్రోవర్ అంటూ నెటిజన్స్ విరుచుకు పడుతున్నారు. సమయం - సందర్బం ఏది అయినా వరుణ్ అలాంటి వ్యాఖ్యలు చేసి ఉండకూడదు. ఇన్నాళ్లు అతడు ఇండస్ట్రీలో కొనసాగడమే ఎక్కువ అంటూ మరి కొందరు ట్వీట్స్ చేస్తున్నారు.

ఇక దర్శకుడు అశోక్ పండిట్ తన ట్విట్టర్ లో ఈ వీడియోతో పాటు ఇండస్ట్రీలో ఆడవారి అభ్యున్నతి అంటూ మాట్లాడే స్వరా భాస్కర్ - రిచా చద్దా - షబానా అజ్మీ వంటి వారిని ట్యాగ్ చేసి విమర్శలు చేశాడు. ఇలాంటి వారి వ్యాఖ్యలు మీకు కనిపించవా అంటూ ప్రశ్నించాడు. గతంలో ఇతడు చేసిన వ్యాఖ్యలు ఆడవారిని అ గౌరవ పర్చే విధంగా ఉన్నాయి. అయినా కూడా అప్పుడు ఎవరు మాట్లాడలేదు ఎందుకు అన్నాడు. గత కొన్నాళ్లుగా మీటూ ఉద్యమం నేపథ్యంలో స్వరా భాస్కర్ - రిచా చద్దా వంటి వారు మహిళ సాధికారత వంటి విషయాలపై మాట్లాడుతున్నారు. అందుకే దర్శకుడు ఈ వీడియోను ట్వీట్ చేశాడు. అది కాస్త వైరల్ అవ్వడం జరిగింది.

అయేషా టకియా భర్త మరియు మామ గారు ప్రముఖ రాజకీయ నాయకులు. అలాంటి ఇంటి కోడలు అయిన అయేషా టకియా గురించి ఇప్పుడు ఇలాంటి వీడియోలు రావడంతో మరింత చర్చనీయాంశం అయ్యింది.