Begin typing your search above and press return to search.

ఆ రెండు సినిమాలు ఏమవుతాయో!

By:  Tupaki Desk   |   23 Aug 2017 5:41 AM GMT
ఆ రెండు సినిమాలు ఏమవుతాయో!
X
ప్రస్తుత రోజుల్లో తమిళ సినిమాలకు తెలుగులో పాపులారిటీ బాగా ఎక్కువైపోతోంది. తెలుగులో డబ్ చేసిన నిర్మాతలకు కొన్నదానికన్నా రెండురెట్లు ఎక్కువగానే సంపాదించి పెడుతున్నాయి. ఇక కొందరు తమిళ స్టార్ హీరోలకు కూడా ఇక్కడ మంచి గుర్తింపు ఉంది. వారికంటూ ఓ మార్కెట్ ను సెట్ చేసుకొని అప్పుడప్పుడు సూపర్ హిట్స్ అందుకుంటున్నారు. ఈ వారం అదే తరహాలో అదృష్టాన్ని పరక్షించుకోబోతున్నారు ఇద్దరు తమిళ స్టార్ హీరోలు. దానితో పాటు ఒక తెలుగు సినిమా కూడా పోటీ పడబోతోంది.

అజిత్- శివ కాంబినేషన్ లో వస్తున్న "వివేకం" మరియు రజినీకాంత్ కూతురు సౌందర్య డైరెక్షన్ లో ధనుష్ హీరోగా వస్తున్న "విఐపి 2" ఈ శుక్రవారం "అర్జున్ రెడ్డి"తో పోటీ పడబోతున్నాయి. ఈ మూడు సినిమాల్లో వివేకం ఒకరోజు ముందుగానే వస్తుండగా శుక్రవారం రోజు మిగతా రెండు సినిమాలు ఒకే రోజు వస్తున్నాయి. ఈ మూడు సినీమాల్లో ధనుష్ -విఐపి 2 అంతగా ఏమి ఆకట్టుకోకపోవచ్చు. ఎందుకంటే తమిళ ప్రేక్షకులు ఈ సినిమాను అంతగా ఇష్టపడలేదు. రఘువరన్ బీటెక్ సినిమాతో తెలుగులో మంచి హిట్ అందుకున్న ధనుష్ దానికి కొనసాగింపుగా వస్తున్న విఐపి 2 తమిళ్ లో బిలో యావరేజ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇక వివేకం సినిమా ట్రైలర్స్ తో తమిళ్ లో దుమ్ము లేపుతున్నా మరి ఇక్కడ ఎంతవరకు సక్సెస్ అవుతుందో చెప్పేలెం. అజిత్ కి కూడా టాలీవుడ్ లో అంతగా మార్కెట్ ఏమి లేదు.

ఇక శుక్రవారం ఫేవరేట్ గా బరిలోకి వచ్చేది మాత్రం అర్జున్ రెడ్డి మాత్రమే. ఇప్పటికే ట్రైలర్స్ తో ఆకట్టుకొని యూత్ లో మంచి హైప్ ని పెంచుకుంది. చిత్ర యూనిట్ కూడా తాము చేసిన కాంట్రోవవర్శీలపై కంటెంట్ పై చాలా నమ్మకంగా ఉన్నారులే. మరి ఇద్దరి తమిళ్ స్టార్స్ కి అర్జున్ రెడ్డి ఎంతవరకు పోటీని ఇస్తాడో చూడాలి.