Begin typing your search above and press return to search.

నయనతారకేగా ఈ కమెడియన్ పంచ్!!

By:  Tupaki Desk   |   26 Oct 2016 5:42 AM GMT
నయనతారకేగా ఈ కమెడియన్ పంచ్!!
X
కమెడియన్లు స్టార్ హీరోయిన్లపై కౌంటర్లు వేసే సంఘటనలు అరుదుగా జరుగుతూ ఉంటాయి. కార్తీ హీరోగా.. నయనతార హీరోయిన్ గా నటించిన కాష్మోరా ఈ దీపావళికి విడుదలకు సిద్ధమైంది. తమిళ్ తోపాటు తెలుగులో కూడా భారీ అంచనాల మధ్య ఈ మూవీ రిలీజ్ కానుండగా.. కోలీవుడ్ కంటే టాలీవుడ్ లోనే బారీ రిలీజ్ ప్లాన్ చేయడం విశేషం.

అయితే.. ఈ సినిమా ప్రమోషన్స్ కోసం హీరో కార్తి.. రెండు ఏరియాల్లోనూ ప్రచారం కోసం తిరిగేస్తున్నాడు. ఈ ప్రమోషన్స్ లో పాల్గొన్న తమిళ కమెడియన్ వివేక్.. కొందరు హీరోయిన్స్ అంటూ జనరలైజ్ చేసి నయనతారకు కౌంటర్ వేశాడు. ''కొందరు హీరోయిన్లు ప్రమోషన్స్ లో పాల్గొనడం మానేస్తుంటారు. ఇందుకు వారు చెప్పే సమాధానం కూడా చాలా తెలివిగా ఉంటుంది. తాను సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటే మూవీ ఫెయిల్ అవుతుందని సెంటిమెంట్ అంటూ నిర్మాతలను భయపెడుతూ ఉంటారు. ఇదే మాదిరిగా.. వీళ్లు పూర్తిగా రెమ్యూనరేషన్ తీసుకున్నా సరే సినిమా ఫెయిల్ అవుతుందనే సెంటిమెంట్ ఉంటే బాగుంటుందేమో'' అన్నాడు వివేక్.

ఈ కామెంట్స్ చేసినపుడు.. నయనతార పేరును మనోడు ప్రస్తావించకపోయినా.. ఇలా చేసేది కేవలం నయనతార మాత్రమే అనే విషయం అందరికీ తెలిసిందే. ఇప్పటివరకూ ఈ టాపిక్ పై ఎవరూ మాట్లాడే ధైర్యం చేయలేదు. మొదటగా వివేక్ పబ్లిక్ గా కౌంటర్ వేయడం విశేషం. ఇక మీడియాలో నయనతారకు పంచ్ వేశాడు అనే రచ్చ ఎక్కువైపోవడంతో.. ''నేను నయన్ కు పెద్ద ఫ్యాన్ ను. నేను చెప్పింది ఆమె గురించి కాదు'' అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు వివేక్. మనోడు ఎన్ని క్లారిటీలు ఇచ్చినా.. అక్కడ పంచ్ పడింది నయనకేలే!!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/