Begin typing your search above and press return to search.

గీతాంజలి దర్శకుడి సాహసం

By:  Tupaki Desk   |   17 July 2018 1:30 PM GMT
గీతాంజలి దర్శకుడి సాహసం
X
కామెడీ హారర్ జానర్ లో ఒక ట్రెండ్ సృష్టించిన గీతాంజలి దర్శకుడు రాజ్ కిరణ్ కొత్త సినిమా విశ్వామిత్ర లోగో లాంచ్ అయ్యింది. సత్యం రాజేష్ హీరోగా నందిత రాజ్ హీరోయిన్ గా అశుతోష్ రానా మరో కీలక పాత్రలో నటిస్తున్న ఈ మూవీ షూటింగ్ సగానికి పైగా పూర్తయిపోయింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో పలు ఆసక్తికరమైన విషయాలు చెప్పుకొచ్చారు. కథ బాగుందని చెప్పిన కొందరు హీరోయిన్లు సత్యం రాజేష్ హీరో అనగానే వద్దని చెప్పారని కానీ నందితా రాజ్ మాత్రం చేయడానికి ముందుకువచ్చారని చెప్పిన రాజ్ కిరణ్ ఆమెకు ప్రత్యేక థాంక్స్ చెప్పాడు. అమెరికాలో జరిగిన నమ్మశక్యం కానీ ఒక నిజ జీవిత సంఘటన ఆధారంగా కథ రాసుకున్నానని ఖచ్చితంగా థ్రిల్ చేస్తుందని హామీ ఇచ్చారు. వంశీ కృష్ణ ఆకెళ్ళ మాటలు మరో ప్లస్ పాయింట్ గా చెప్పిన రాజ్ కిరణ్ లోగో ద్వారా ఆసక్తి రేపాడు.

గీతాంజలి సక్సెస్ తర్వాత కలర్స్ స్వాతితో రాజ్ కిరణ్ తీసిన త్రిపుర ఆశించిన విజయం అందుకోలేదు. ఆ తర్వాత మంచు విష్ణుతో రెగ్యులర్ కమర్షియల్ ఫార్మట్ లో తీసిన లక్కున్నోడు సక్సెస్ కాలేదు. అందుకే తనకు పట్టున్న హారర్ థ్రిల్లర్ వైపు రాజ్ కిరణ్ మళ్ళి టర్న్ తీసుకున్నాడు. సత్యం రాజేష్ సైతం కాన్ఫిడెన్స్ వ్యక్తం చేస్తూ పేరుకి హీరో అయినా మిగిలిన పాత్రలు చాలా కీలకంగా ఉంటాయని చెప్పుకొచ్చాడు. మొత్తానికి విశ్వామిత్ర టైటిల్ తో పాటు లోగో పోస్టర్ ద్వారా హైప్ తెచ్చే ప్రయత్నం చేసిన టీమ్ అందరి దృష్టిని ఆకర్షించింది అని చెప్పొచ్చు. విడుదల ఇంకా ఖరారు కానీ విశ్వామిత్రకు జవాన్ ఫేమ్ దర్శకుడు బివిఎస్ రవి సహకారం కూడా ఉందని రాజ్ కిరణ్ స్పష్టం చేసారు. రాజ్ కిరణ్ దర్శకుడైనప్పటికీ వంశీ కృష్ణ ఆకెళ్ళ-బివిఎస్ రవి ఇలా ముగ్గురు దర్శకుల టీమ్ తో వస్తున్న విశ్వామిత్ర మీద అంచనాలు మెల్లగా పెరిగేలా ఉన్నాయి.