Begin typing your search above and press return to search.

రమ్యకృష్ణకి ఎవర్ గ్రీన్ కాంప్లిమెంట్

By:  Tupaki Desk   |   28 Nov 2015 5:07 PM GMT
రమ్యకృష్ణకి ఎవర్ గ్రీన్ కాంప్లిమెంట్
X
మామ మంచు అల్లుడు కంచు.. టైటిల్ తో ఇంట్రెస్ట్ క్రియేట్ చేసిన ఈ మూవీ.. కాస్టింగ్ తో మరింత స్పెషల్ అయింది. మోహన్ బాబు - అల్లరి నరేష్ ల ప్రత్యేకమైన కాంబినేషన్ లో వస్తున్న ఈ మూవీ.. ఆడియో ఫంక్షన్ జరిగింది. ఈ కార్యక్రమంలో మోహన్ బాబు తనయుడు మంచు విష్ణు.. హీరోయిన్స్ పై సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు.

"నాతో పాటు కలిసి నటించిన, మిగిలిన ఈ కాలం హీరోయిన్స్ అందరూ హర్ట్ అయినా సరే.. నేనో విషయం చెప్పాలి. స్విమ్ సూట్ లో హాటెస్ట్ హీరోయిన్ మాత్రం.. ఎప్పటికీ రమ్యకృష్ణ గారే. ఆవిడ ఆకర్షణ, అందంతో ఎవరూ సరితూగలేరు. ఇది ఆవిడకి నా కాంప్లిమెంట్ "అన్నాడు విష్ణు. ఏమైనా తండ్రితో నటించిన హీరోయిన్ పై ఇలాంటి స్విమ్ సూట్ కామెంట్స్ చేయాలంటే.. ఏ కుమారుడికి అయినా డేర్ ఉండాలి. విష్ణుు ఆ ధైర్యం బాగానే ఉంది. ఇంతలా చేయడానికి కారణం లేకపోలేదు లెండి.

ఈ తరం హీరోయిన్లు ఎక్స్ పోజింగ్ కి చిరునామా మారుతున్నారని, స్కిన్ షో చేసి ఆకట్టుకుంటున్నారని మనకి తెలుసు. ముఖ్యంగా ఇప్పుడు బికినీలు, స్విమ్ సూట్లు బాగా పాపులర్ అయిపోయాయి. ఇప్పుడు కామనే కానీ.. గతంలో ఓ హీరోయిన్ స్విమ్ సూట్ వేస్తే అదో సంచలనం. కానీ ఆ రోజుల్లోనే స్విమ్ సూట్ వేసి, గ్లామర్ తో పెర్ఫామెన్స్ తో కూడా ఆకట్టుకున్న అందాల తార రమ్యకృష్ణ. అందుకే.. విష్ణు అంత ఓపెన్ గా పొడిగేశాడు. చాలా ఏళ్ల తర్వాత మామ మంచు.. అల్లుడు కంచు మూవీలో మోహన్ బాబుకు జోడీగా నటిస్తున్నారు రమ్యకృష్ణ.