Begin typing your search above and press return to search.

బన్నీ పని మొదలెట్టిన బాలీవుడ్డోళ్ళు

By:  Tupaki Desk   |   19 April 2017 4:50 AM GMT
బన్నీ పని మొదలెట్టిన బాలీవుడ్డోళ్ళు
X
బాలీవుడ్ టాప్ మ్యుజీషియన్స్ లో విశాల్-శేఖర్ ద్వయం కూడా ఉంటారు. ఎన్నో ప్రాజెక్టులను తమ మ్యూజిక్ స్టాండర్డ్స్ తో హై లెవెల్ కి తీసుకెళ్లిపోయారు విశాల్-శేఖర్. ఎన్నో ప్రతిష్టాత్మక చిత్రాలకు సంగీతం అందించగా.. వీటిలో గోల్ మాల్ సిరీస్.. ఓం శాంతి ఓం.. దోస్తానా.. డర్టీ పిక్చర్.. స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్.. చెన్నై ఎక్స్ ప్రెస్ వంటి చిత్రాలు ఉన్నాయి.

గతేడాది వచ్చిన సుల్తాన్.. బేఫికర్ లకు కూడా వీరే మ్యూజిక్ ఇచ్చారు. సల్మాన్ నెక్ట్స్ మూవీ టైగర్ జిందాహై కూడా వీరిదే. ఈ మ్యుజీషియన్స్ ను అల్లు అర్జున్ టాలీవుడ్ కి తీసుకొస్తున్నాడు. వక్కంతం వంశీ దర్శకత్వంలో రూపొందే మూవీ కి సంగీతం అందించనున్నారు విశాల్ - శేఖర్. బాలీవుడ్ లో మ్యూజిక్ స్టాండర్డ్స్ ను మరో లెవెల్ పెంచిన వీరిద్దరు.. బన్నీ కోసం ఎలాంటి సంగీతం ఇస్తారో అనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. మే నెలలో బన్నీ తన తర్వాతి చిత్ర షూటింగ్ ప్రారంభించే అవకాశాలుండగా.. ఇప్పటికే విశాల్-శేఖర్ లు కంపోజిషన్ మొదలుపెట్టేశారట.

అంతర్లీనంగా దేశభక్తి థీమ్ తో రూపొందబోయే ఈ మూవీకి.. పవర్ ఫుల్ ట్యూన్స్.. బ్యాక్ గ్రౌండ్ సిద్ధం చేస్తున్నారట విశాల్-శేఖర్. ప్రస్తుతం ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ లు శరవేగంగా జరుగుతున్నాయి. విశాల్- శేఖర్ గతంలో కూడా ఓ తెలుగు సినిమాకు పని చేశారు. వెంకీ మూవీ చింతకాయల రవికి సంగీతం ఇచ్చినది వీళ్లే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/