Begin typing your search above and press return to search.

విశాల్ పెళ్లాడే సివంగి పిల్

By:  Tupaki Desk   |   16 Jan 2019 4:30 AM GMT
విశాల్ పెళ్లాడే సివంగి పిల్
X
హీరో విశాల్ పెళ్లాడే సివంగి పిల్ల ఎవ‌రో తెలుసా? ఎప్పుడైనా చూశారా? ప‌్ర‌స్తుతం సౌత్ ఇండ‌స్ట్రీస్‌ లో అగ్ర‌ప‌థంలో దూసుకుపోతున్న విశాల్‌ హైదరాబాదీ అమ్మాయిని పెళ్లాతున్నాడ‌ని వార్త‌లొచ్చాయి. కానీ ఆ సివంగి పిల్ల ఎవ‌రో మాత్రం ఇంత‌వ‌ర‌కూ ఫోటోలు బ‌య‌ట‌కు రాలేదు. తాజాగా విశాల్ త‌న‌తో పాటు సివంగి పిల్ల ఫోటోని షేర్ చేశాడు. ప్ర‌స్తుతం ఆ ఫోటో వెబ్ లో జోరుగా వైర‌ల్ అయిపోతోంది. ఇంత‌కీ ఎవ‌రా సివంగి పిల్ల? అంటే హైద‌రాబాద్ కు చెందిన బిజినెస్ ఫ్యామిలీ విజ‌య్ రెడ్డి- ప‌ద్మ‌జ‌ల త‌న‌య అనీషా రెడ్డి. సివంగి పిల్ల సివంగి పిల్ల! అంటూ పందెంకోడి 2లో కీర్తి సురేష్ వెంట ప‌డ్డాడు. కానీ ఇక‌పై అనీషా వెంట త‌ప్ప ఇంకెవ‌రి వెంటా ప‌డే ఛాన్సే లేదు.

విశాల్ ఇదివ‌రకూ త‌న చిన్న‌నాటి స్నేహితురాలు - త‌న రైవ‌ల్ మామ శ‌ర‌త్ కుమార్ కుమార్తె వ‌ర‌ల‌క్ష్మి తో ఎఫైర్ సాగించాడ‌ని వార్త‌లొచ్చాయి. కానీ ఆ ఇద్ద‌రూ ఆ త‌ర్వాత మేం కేవ‌లం స్నేహితులం మాత్ర‌మే.. ప్రేమా గీమా జాన్తా న‌య్‌! అంటూ ఆ ప్ర‌చారాన్ని కొట్టిపారేశారు. అంతేకాదు విశాల్ సినిమాల్లో విల‌న్ వేషాల‌తోనూ వ‌ర‌ల‌క్ష్మి అద‌ర‌గొట్టేసింది.

పందెంకోడి 2 త‌ర్వాత ప్ర‌స్తుతం టెంప‌ర్ రీమేక్ `అయోగి`పైనే విశాల్ దృష్టి పెట్టాడు. ఓవైపు ఈ చిత్రాన్ని పూర్తి చేసే క్ర‌మంలోనే త్వ‌ర‌లో నిశ్చితార్థం జ‌ర‌గ‌నుంద‌న్న వార్త‌లు వ‌స్తున్నాయి. 2019 ఆగ‌స్టులో విశాల్-అనీషా జంట వివాహం ఉంటుంద‌ని చెబుతున్నారు. మొత్తానికి న‌డిగ‌ర సంఘం - నిర్మాత‌ల మండ‌లి భ‌వంతి నిర్మాణం పూర్తి చేసి పెళ్లి చేసుకుంటాన‌న్న విశాల్ ఆ మాట నిల‌బెట్టుకుంటున్నాడో లేదో కాస్త వేచి చూడాలి. ఇక ఈ వారంలోనే ఇరు బంధువుల త‌ర‌పున నిశ్చితార్థానికి సంబంధించిన ప్ర‌క‌ట‌న వెలువ‌డ‌నుంద‌ని తెలుస్తోంది.