Begin typing your search above and press return to search.

విశాల్ విషయంలో ఇది కూడా ఆలోచించండి

By:  Tupaki Desk   |   26 May 2018 11:30 PM GMT
విశాల్ విషయంలో ఇది కూడా ఆలోచించండి
X
కోలీవుడ్ హీరో చాలా ధైర్యంగా మాట్లాడేశాడు. తెలుగు హీరోలే రాజకీయ అంశాలపై.. ప్రత్యేక హోదాపై మాట్లాడడానికి మొహమాటపడుతుంటే.. భయపడుతుంటే.. వెనకాడుతుంటే.. విశాల మాత్రం తెగువ చూపించేశాడు.. అంటూ తెగ కథనాలు వస్తున్నాయి.

"నిజం చెప్పడానికి ధైర్యం అవసరం లేదు బాధ్యత ఉంటే చాలు. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా కు మద్దతు ఇస్తాను. సమాజంలో జరిగిన మంచి చెడులు సినిమాలో చూపించటానికి వెనకాడను" అంటూ హైద్రాబాద్ లో కూర్చుని స్టేట్మెంట్ కూడా ఇవ్వడం హైలైట్. అయితే.. ఇదంతా విశాల్ ఎప్పుడు చెప్పాడు అన్న విషయాన్ని పట్టించుకోవాలి. అభిమన్యుడు మూవీ రిలీజ్ కి రెడీ అయిన సందర్భంగా.. ఆ సినిమాకు ప్రచారం చేసుకునేందుకు హైద్రాబాద్ వచ్చి.. ఇక్కడి మీడియా అడిగితే.. తన ఉద్దేశ్యాన్ని చెప్పడం. ఇక్కడ విశాల్ ను తప్పు పట్టడానికి ఏమీ లేదు. తన అభిప్రాయం సూటిగా సుత్తి లేకుండా చెప్పాడు. కానీ విశాల్ తో మన హీరోలను పోల్చి నోటికొచ్చిందల్లా తిడుతున్నారు కొందరు. మనోళ్లు సైలెంట్ గా ఉంటే విశాల్ ధైర్యంగా మాట్లాడేశాడు అంటూ అందరూ తెగ పొగిడేస్తున్నారు. అందులో నిజం ఉండొచ్చు కాని.. ఓసారి మరోవైపు కూడా ఆలోచిస్తే బెటర్.

విశాల్ ఏం మాట్లాడినా అతడికి నష్టమేమీ లేదు. ఇబ్బందులు అంతకంటే ఉండవు. మహా అయితే ప్రచారం దక్కి.. సినిమాకి నాలుగు డబ్బులు ఎక్కువ రాలతాయి. ఇదే టాపిక్ పై తెలుగు హీరోలు రియాక్ట్ అయిన తర్వాత.. వారు ఆంధ్ర అండ్ తెలంగాణాల్లో తిరగాలి. కాబట్టి జాగ్రత్తగా మాట్టాడక తప్పని పరిస్థితి. అలా అంటే తమిళ్ సినీ రంగం జల్లికట్టుకును తప్పనిసరి పరిస్థితిలో సమర్ధించినపుడు.. టాలీవుడ్ జనాలు జల్లికట్టుపై తమ అభిప్రాయాన్ని ఎలాంటి భయం లేకుండానే చెప్పారు. కాశ్మీర్ వంటి అంశాల్లో మాట్లాడతారు కదా. ఇక్కడ ప్లేస్ వాల్యూ అనే పాయింట్ ను మిస్ అయితే ఎలా బాసూ?