శ్రీరెడ్డి నా పేరు కూడా చెబుతుందేమో..

Wed Jun 13 2018 18:49:40 GMT+0530 (IST)

టాలీవుడ్ లో శ్రీరెడ్డి రేపిన కలకలం అంతా ఇంతా కాదు. ఇండస్ట్రీ పెద్దలు కూడా కదలాల్సి వచ్చింది. ఓ స్టేజ్ లో ఈమె హంగామా పీక్స్ చేరిపోయి ఓ ఉద్యమంగా మారిపోతుందేమో అనిపించగా.. పవన్ కళ్యాన్ ను బూతు తిట్టి మొత్తం చేజార్చుకుంది. ఆ తర్వాత ఈమె గురించి పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవు. ఏవేవో కథలు చెప్పుకోవడమే తప్ప.. ఇండస్ట్రీ జనాలే కాదు.. కామన్ పీపుల్ కూడా అంతగా కేర్ చేయడం మానేశారు.అయితే.. గతంలో ఇన్ డైరెక్టుగా హింట్స్ ఇచ్చిన శ్రీరెడ్డి.. నాని విషయంలో మాత్రం నేరుగానే పేరు చెప్పి రచ్చ చేసింది. దీంతో నాని ఇప్పుడు పరువు నష్టం దావా వేశాడు కూడా. నానికి మద్దతుగా తమిళ హీరో విశాల్ మాట్లాడాడు. నాని తన ఫ్రెండ్ అని చెప్పిన విశాల్.. ఆ ఒక్క కారణంతోనే అతడిని సపోర్ట్ చేయడం లేదని.. నాని గురించి ఇండస్ట్రీ మొత్తానికి తెలుసు అని అన్నాడు. మహిళలతో ఎలా ప్రవర్తించాలనే విషయంలో నానికి నిర్దిష్ట అభిప్రాయాలు ఉన్నాయని చెప్పాడు విశాల్.

ఇలాంటి ఆరోపణలు చేయడమే కాకుండా.. వాటికి శ్రీరెడ్డి ఆధారాలు కూడా చూపాలని అన్నాడు విశాల్. ఆమె వ్యవహారం చూస్తుంటే ఒకరి తర్వాత మరొక పేరు చెబుతోందని అర్ధమవుతోందని.. కొన్నాళ్ల తర్వాత శ్రీరెడ్డి తన పేరు చెప్పినా చెప్పవచ్చని అన్నాడు ఈ తమిళ హీరో. మన చట్టాలు ఇలాంటి వాటికి ఫేవర్ గా ఉన్నాయని.. ఆరోపణలు చేసిన వాళ్లకే అనుకూలంగా ఉండగా.. వాటిని ఎదుర్కునేవాళ్లకు మాత్రం తమను తాము సమర్ధించుకునేందుకు ఆ తర్వాతెప్పుడో కానీ ఛాన్స్ రావడం లేదని అన్నాడు విశాల్.