Begin typing your search above and press return to search.

కుర్రాడి స్ర్టయిట్‌ మూవీ మొదలవుతోంది

By:  Tupaki Desk   |   29 May 2016 1:30 PM GMT
కుర్రాడి స్ర్టయిట్‌ మూవీ మొదలవుతోంది
X
స్వతహాగా తెలుగబ్బాయి అయిన విశాల్.. తమిళంలో పెద్ద స్టార్ హీరోగా ఎదిగాడు. పందెంకోడితో టాలీవుడ్ ప్రేక్షకుల్లో కూడా మంచి గుర్తింపు సంపాదించినా.. ఆ స్థాయిలో మళ్లీ సినిమా ఇవ్వడంలో మాత్రం ఫెయిల్ అయ్యాడు విశాల్. ఈ నల్లనయ్య చేసే సినిమాలు తమిళ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటున్నా.. నేటివిటీ ప్రాబ్లెంతో తెలుగు ఆడియన్స్ రిసీవ్ చేసుకోలేకపోతున్నారు. రీసెంట్ గా వచ్చిన రాయుడు పరిస్థితి కూడా ఇదే.

తెలుగులో స్ట్రయిట్ సినిమా చేయాలనే ఆలోచన విశాల్ కు ఎప్పటి నుంచో ఉన్నా.. ఇప్పటివరకూ సరైన ప్రాజెక్ట్ సెట్ కాలేదు. ఇప్పుడు విశాల్ డైరెక్ట్ తెలుగు మూవీకి అన్నీ ఫిక్స్ అయ్యాయి. హరి వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై తీయనున్న చిత్రంలో విశాల్ హీరో కాగా. సురాజ్ దర్శకత్వంలో ఈ మూవీని తెరకెక్కించనున్నారు. జూన్ 9నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించుకోనున్న ఈ మూవీలో.. మిల్కీ బ్యూటీ తమన్నాను హీరోయిన్ గా తీసుకోవడం విశేషం. ఈ సినిమాకు వీళ్లిద్దరి కాంబినేషనే హైలైట్ గా నిలుస్తుందని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి.

ఇక టాలీవుడ్ పోష్ విలన్ జగపతి బాబు.. విశాల్ తోనూ విలన్ గా ఢీ కొట్టనుండగా.. తరుణ్ అరోరా మరో విలన్ పాత్రలో యాక్ట్ చేయనున్నాడు. అయితే ఆన్ స్క్రీన్ లవై విశాల్ - తమన్నాల జంట ఎలా ఉంటుందోననే ఆసక్తి ఇండస్ట్రీలో ఎక్కువైంది.