Begin typing your search above and press return to search.

టీజర్ టాక్:. క్షమించను అంటున్న విశాల్

By:  Tupaki Desk   |   21 Oct 2016 6:00 PM GMT
టీజర్ టాక్:. క్షమించను అంటున్న విశాల్
X
కోలీవుడ్ హీరో విశాల్.. మిల్కీ బ్యూటీ తమన్నా జంటగా కత్తి సాందాయ్ అనే మూవీ రూపొందుతుండగా.. దీన్ని ఒక్కడొచ్చాడు అనే పేరుతో తెలుగులో రిలీజ్ చేయనున్నారు. ఓ వారం క్రితం తమిళ్ టీజర్ రిలీజ్ చేయగా.. ఇప్పుడు ఒక్కడొచ్చాడు టీజర్ కూడా వచ్చేసింది.

అసలు ఈ టీజర్ కంటే ముందు 'నే కొంచెం నలుపులే' అంటూ ఓ పాట విడుదల చేసి ఆశ్చర్యపరిచిన విశాల్.. ఇప్పుడు మాత్రం టీజర్ తో కేకలు పెట్టించేశాడనే చెప్పాలి. యాక్షన్ ఎలిమెంట్స్ ఆ రేంజ్ లో ఉన్నాయ్ మరి. టీజర్ స్టార్టింగ్ లో మొదలుపెట్టి.. కేరక్టరైజేషన్ గురించి చెప్పకుండానే.. సినిమాలో టేకింగ్ ఏ రేంజ్ లో ఉందో చూపించుకుంటూ.. హీరో చెప్పే ఒకే ఒక డైలాగ్ తో టీజర్ కట్ చేశాడు దర్శకుడు సురాజ్. 'తప్పు చేసిన వాడినైనా క్షమిస్తాను.. కానీ చేసిన తప్పును సమర్ధించే వాడిని.. ఎప్పటికీ క్షమించను' అంటూ విశాల్ చెప్పడమే మొత్తం టీజర్ తో వినిపించే డైలాగ్. ఈ పాయింట్ చుట్టూనే సినిమా ఉంటుందనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

తమన్నా డ్యాన్సులైతే ఇరగదీసేసింది. చేతిలో గన్ను పట్టుకుని తమ్మూ కాల్చేస్తోంది కూడా. జగపతి బాబు యాజ్ యూజువల్ గా ఓల్డేజ్ గెటప్ లో స్టైలిష్ లుక్ ఇచ్చేశాడు.