Begin typing your search above and press return to search.

విశాల్ కూడా ‘ఒక్క‌డు’గానే వ‌స్తున్నాడు

By:  Tupaki Desk   |   25 July 2016 3:30 PM GMT
విశాల్ కూడా ‘ఒక్క‌డు’గానే వ‌స్తున్నాడు
X
ఒక్క‌డు చాలు.. ఒకే ఒక్క‌డు.. ఒక్క‌డు..ఒక్క‌డే.. ఒక్క‌డున్నాడు..వీడొక్క‌డే.. వీరుడొక్క‌డే.. ఇలా తెలుగులో ‘ఒక్క‌డు’ టైటిళ్లు చాలానే ఉన్నాయి. ఇవ‌న్నీ కాకుండా లేటెస్టుగా నారా రోహిత్ ‘అప్ప‌ట్లో ఒక‌డుండేవాడు’ అనే టైటిల్ తో వ‌స్తున్నాడు. విక్ర‌మ్ ‘ఇరుముగ‌న్ సినిమాను ‘ఇంకొక్క‌డు’ పేరుతో అనువ‌దిస్తున్నారు. ఇవ‌న్నీ చాల‌వ‌న్న‌ట్లు తెలుగులో ఇంకో ‘ఒక్క‌డు’ వ‌స్తున్నాడు. విశాల్ త‌మిళంలో న‌టిస్తున్న‌ కొత్త సినిమా ‘క‌త్తి సండై తెలుగులో ‘ఒక్క‌డొచ్చాడు’ పేరుతో అనువాదం కాబోతోంది.

సూరజ్ దర్శకత్వం వహిస్తున్న ‘కత్తి సండై’ ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్టైనర్. ఈ సినిమాలో విశాల్ సరసన మిల్కీ బ్యూటీ త‌మన్నా కథానాయికగా నటిస్తుండం విశేషం. మ‌న జ‌గ‌ప‌తి బాబు ఇందులో విల‌న్ పాత్ర పోషిస్తున్నాడు. బాలీవుడ్ న‌టుడు త‌రుణ్ అరోరా మ‌రో విల‌న్ గా న‌టిస్తున్నాడు.సెప్టెంబ‌ర్లో ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకొస్తుంది. ఈ సినిమాలో విశాల్ స‌ర‌స‌న మిల్కీ బ్యూటీ ఎలా ఉంటుంద‌న్న‌ది ఆస‌క్తిక‌రం. ఈ మ‌ధ్య తెలుగు సినిమాల నుంచి విరామం తీసుకుని.. వ‌రుస‌గా త‌మిళ సినిమాలు చేస్తోంది త‌మ్మూ. విజ‌య్ సేతుప‌తితో ధ‌ర్మ‌దురై.. ప్ర‌భుదేవాతో దేవి (అభినేత్రి)తో పాటు విశాల్ సినిమా కూడా ఆమె చేతిలో ఉన్నాయి.