విశాల్ చెప్పిన ప్రియురాలి ముచ్చట్లు

Mon Feb 11 2019 10:39:39 GMT+0530 (IST)

చాలా కాలంగా హిట్లు లేక టాలీవుడ్ మార్కెట్ ని బాగా డౌన్ చేసుకున్న తెలుగువాడైన తమిళ హీరో విశాల్ గత ఏడాది అభిమన్యుడుతో మంచి కం బ్యాక్ ఇచ్చి కమర్షియల్ సక్సెస్ అందుకున్నాడు. తర్వాత వచ్చిన పందెం కోడి 2 అద్భుతాలు చేయకపోయినా బిసి సెంటర్స్ లో బయ్యర్లను ఒడ్డున పారేసింది. ఇదిలా ఉండగా నెల రోజుల క్రితం విశాల్ చేసుకోబోయే అమ్మాయి గురించి డీటెయిల్స్ బయటికి వచ్చాక అభిమానులకు అన్ని సందేహాలు తొలగిపోయాయి. అనీషాకు మూడు ముళ్ళు వేయబోతున్నానని అధికారికంగా ప్రకటించేసాడు.కొన్నేళ్ల క్రితం వరకు వరలక్ష్మి శరత్ కుమార్ తో ప్రేమాయణం సాగిస్తున్నాడు అని విశాల్ మీద చాలా కథనాలు వచ్చాయి. అప్పట్లో ఇద్దరూ ఖండించలేదు కానీ బ్రేక్ అప్ అయ్యాక మాత్రం ఆబ్బె అలాంటిది ఏమి లేదని చెప్పుకోవడం మీడియాలో హై లైట్ అయ్యింది. అది నిజమో అబద్దమో పక్కన పెడితే విశాల్ ఓ తెలుగు అమ్మాయిని చేసుకోవడం మాత్రం విశేషమే. అయితే తన గురించి వివరాలు పెద్దగా ఎవరికి తెలియక పోవడంతో విశాల్ స్వయంగా వాటిని షేర్ చేసుకున్నాడు.

అర్జున్ రెడ్డిలో చిన్న పాత్ర పోషించిన అనీషాను తాను దర్శకత్వం వహించబోయే డెబ్యూ మూవీ డిస్కషన్ కోసం విశాల్ కలిసాడు. అది వీధిలో సంచరించే శునకాల కాన్సెప్ట్ తో విశాల్ రాసుకున్నాడు. అది అనీషాకు వినిపించి తన అభిప్రాయం చెప్పమన్నప్పుడు మొదలైన పరిచయం ప్రేమగా మారి అటునుంచి పెళ్ళికి దారి తీసింది. సినిమా టీమ్ లో అనీషా మెంబెర్ కావడం ఏకంగా విశాల్ కు భార్య అయ్యే దాకా తెచ్చేసింది. అనీషా జాతీయ స్థాయి బాస్కెట్ బాల్ స్పోర్ట్స్ విమెన్. అదే కాదు సోషల్ సర్వీస్ తో పాటు పులులను నిద్ర పుచ్చే విద్యకు అనీషాకు తెలుసు. ఈ విశేషాలన్నీ విశాల్ ఇటీవలే ఇచ్చిన ఓ ఛానల్ ఇంటర్వ్యూలో చెప్పాడు. అయితే విశాల్ లాగే అనీషా కూడా చాలా రకాలుగా మల్టీ టాలెంటెడ్ అన్నమాట