విశాల్ తో జాగ్రత్త బాబులూ..

Thu May 17 2018 21:00:01 GMT+0530 (IST)

ప్రస్తుతం టాలీవుడ్ బాక్సాఫీస్ లో ‘మహానటి’ హవా నడుస్తోంది. ఈ వారాంతాన్ని ఆ చిత్రానికే రాసిచ్చేశారు. వచ్చే వారానికి దీని జోరు కొంచెం తగ్గుతుందని భావిస్తున్నారు. ఆ వారాంతం కోసం ఒకటికి మూడు సినిమాలు షెడ్యూల్ అయ్యాయి కానీ అందులో ఒకటైన ‘ఆఫీసర్’ వాయిదా పడిపోయింది. ‘నేల టిక్కెట్టు’.. ‘నా నువ్వే’ మాత్రమే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఐతే వీటికి తోడుగా ఓ తమిళ సినిమా కూడా లేటుగా రేసులోకి వచ్చింది. విశాల్-సమంత-అర్జున్ కాంబినేషన్లో తమిళంలో తెరకెక్కిన ‘ఇరుంబు తురై’ తెలుగు వెర్షన్ ‘అభిమన్యుడు’ కూడా మే చివరి వారంలోనే రిలీజవుతుంది. రెండు తెలుగు సినిమాలు రిలీజైన ఒక రోజు తర్వాత.. అంటే 26న ఈ చిత్రం విడుదలవుతుందని అంటున్నారు. మామూలుగా అయితే విశాల్ సినిమాను చూసి పెద్దగా భయపడాల్సిన పని లేదు. కానీ ‘అభిమన్యుడు’ సంగతి వేరు.‘నేల టిక్కెట్టు’.. ‘నా నువ్వే’ సినిమాలపై పెద్దగా అంచనాలేమీ లేవు. వీటికి ప్రి రిలీజ్ బజ్ అంతంతమాత్రంగానే ఉంది. ‘నేల టిక్కెట్టు’ టీజర్.. ట్రైలర్ చూస్తే రెగ్యులర్ మాస్ సినిమాలాగా అనిపించింది. ఈ తరహా సినిమాలకు ఇప్పుడు ఆదరణ అంతగా ఉండట్లేదు. మరోవైపు ‘నా నువ్వే’ తో కళ్యాణ్ రామ్ కొత్తగా ఏదో ట్రై చేశాడు కానీ.. ఆ తరహా సినిమా అతడికి నప్పుతుందా అన్న సందేహాలున్నాయి. ‘180’ లాంటి పెయిన్ ఫుల్ మూవీ తీసిన జయేంద్ర ఈసారి ఏమాత్రం ఎంటర్టైన్ చేస్తాడో అన్న సందేహాలున్నాయి. మామూలుగా కళ్యాణ్ రామ్ కు ఉన్నది మాస్ ఫాలోయింగే. వాళ్లు ఈ చిత్రం పట్ల ఏమాత్రం ఆసక్తి చూపిస్తారో. అదే సమయంలో క్లాస్ ఆడియన్స్ కళ్యాణ్ రామ్ ను యాక్సెప్ట్ చేస్తారా అన్న సందేహలున్నాయి. అందుకే దీనిపైనా అంచనాలు తక్కువే. ఇక ‘అభిమన్యుడు’ విషయానికి వస్తే ఆ చిత్రానికి తమిళంలో అదిరిపోయే టాక్ వచ్చింది. అక్కడ సూపర్ హిట్టయింది. చాలా గ్రిప్పింగ్ గా సాగే థ్రిల్లర్ ఇదంటున్నారు. ఇందులో సమంత కథానాయికగా నటించడం.. అర్జున్ విలన్ పాత్ర పోషించడం ప్రత్యేక ఆకర్షణలు. ఒక వేళ ‘నేల టిక్కెట్టు’.. ‘నా నువ్వే’ సినిమాలకు టాక్ తేడాగా ఉంటే మాత్రం ప్రేక్షకులు ‘అభిమన్యుడు’ వైపు మళ్లుతారు. మరి వాటికి టాక్ ఎలా ఉంటుందో చూడాలి.