Begin typing your search above and press return to search.

విరుష్క హనీమూన్ అక్కడే

By:  Tupaki Desk   |   13 Dec 2017 10:48 AM GMT
విరుష్క హనీమూన్ అక్కడే
X
మొత్తానికి నాలుగేళ్ల ప్రేమ జంట పెళ్లి బంధంతో ఒకటైంది. దేశం విడిచి విదేశాల్లో పెళ్లి చేసుకున్నా కూడా వీరి ప్రేమ బంధానికి అభిమానులు చాలా ఆనందపడుతున్నారు. మొదట ఎదో అందరిలానే కొన్ని రోజులు డేటింగ్ చేసి విడిపోతారు అని చాలా కామెంట్స్ వచ్చాయి. కానీ వారిద్దరూ ఒకరినొకరు అర్ధం చేసుకొని హిందూ సంప్రదాయప్రకారం ఒకటయ్యారు. ఇక వారే సోషల్ మీడియా ద్వారా అభిమానులతో ఆనందాన్ని పంచుకోవడంతో విషెస్ ని అందుకున్నారు.

అయితే ఫైనల్ గా పెళ్లి అనంతరం విరుష్క జంట హనీమూన్ కి స్పెషల్ ప్లేస్ ని ఎంచుకుంది. ఇటాలియన్ క్యాపిటల్ రోమ్ లో ఇద్దరు హనీమూన్ ని హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోబోతున్నారట. ఇంతకుముందు అక్కడికి చాలా సార్లు వెళ్లినా కూడా మొదటి సారి పెళ్లైన సందర్బంగా కలిసి అక్కడ హనీమూన్ ని స్పెషల్ గా ప్లాన్ చేసుకున్నారట. ఇదంతా కోహ్లీ అనుష్క నెలముందే రెడీ చేసుకున్నారని తెలుస్తోంది.

ఎక్కువగా వైరల్ చేయకుండా సింపుల్ గా పెళ్లి చేసుకోవాలని ఎప్పటినుంచో అనుకున్నారట. ఇక హనీమూన్ అయిపోగానే కొన్ని రోజుల తర్వాత ఇండియాకు వచ్చి ఇక్కడ రెండు పార్టీలను చేసుకోనున్నారు. ఒకటి రిసెప్షెన్ వేడుక కాగా.. మరొకటి సెలబ్రెటీల మధ్య జరుపుకునే వేడుక. అందుకోసం వారి కుటుంబ సభ్యులు ముందుగానే అన్ని ఏర్పాట్లను రెడీ చేసి. 21 మరియు 26 తేదీలను ఫిక్స్ చేశారు.