Begin typing your search above and press return to search.

మా పెళ్ళైపోయింది. మీ ప్రేమకు థ్యాంక్యూ

By:  Tupaki Desk   |   11 Dec 2017 3:46 PM GMT
మా పెళ్ళైపోయింది. మీ ప్రేమకు థ్యాంక్యూ
X
''అవును. జీవితాంతం ఒకరి ప్రేమలో ఒకరం ఉంటామని ఈరోజు మేం ప్రామిస్ చేసుకున్నాం. ఈ విషయాన్ని మీతో పంచుకోవడానికి ఎంతో ఆనందపడుతున్నాం. మీ ప్రేమానురాగాలతో మా ఆనందం రెట్టింపైంది. మా స్నేహితులకు.. వెల్ విషర్స్ కు.. ఫ్యాన్స్ కు.. కృతజ్ఞతలు చెబుతున్నాం. మా ప్రయాణంలో మీరందరూ ముఖ్యమైన భాగం అయినందుకు సంతోషంగా ఉంది'' అంటూ ఒకేసారి ఒకే సమయంలో.. ట్విట్టర్లో విరాట్ కొహ్లీ.. ఇనస్టాగ్రామ్ లో అనుష్క శర్మ.. పోస్ట్ చేశారు. దానితో ఇక రూమర్లకు శుభం కార్డు వేయక తప్పలేదు.

డిసెంబర్ 11 ఉదయం 8 గంటల మూహూర్తానికి పంజాబీ వెడ్డింగ్ స్టయిల్లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మా.. అలాగే టీమిండియా కెప్టెన్ విరాట కొహ్లీ.. ఇటలీలోని ఒక ప్రైవేట్ రీసార్టులో ఏడడుగులు నడిచారు. వేద మంత్రాల సాక్షిగా జరిగిన పంజాబీ వెడ్డింగ్ లో దంపతులయ్యారు. ఆల్రెడీ ఈ పెళ్ళి విషయం రూమర్లుగా ఎప్పటినుండో వినిపిస్తున్నా.. ఇప్పుడు స్వయంగా ఇద్దరూ చెప్పేయడంతో.. మరో క్రికెట్-సినిమా జంట ఒక్కటై అభిమానులకు ఎనలేని సంతోషం కలిగించింది. ముఖ్యంగా అనుష్క అండ్ విరాట్ కూడా.. మన సమంత అండ్ నాగ చైతన్య తరహాలో తమ కెరియర్ పీక్స్ లో ఉన్నప్పుడు పెళ్లి చేసుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.

కంగ్రాట్స్ కొహ్లీ.. అండ్ అనుష్క.