పీకల్లోతు ప్రేమలో విరుష్క

Tue Feb 20 2018 16:01:17 GMT+0530 (IST)

ఇప్పుడు ఉన్న అందరూ సెలబ్రిటీ కపుల్స్ లో అత్యంత పాపులారిటీ ఉన్నది విరాట్ కోహ్లీ అనుష్క శర్మ అనే చెప్పుకోవాలి. వీరిద్దరి ప్రేమ ఇండియా మొత్తంలోనే ఒక హాట్ టాపిక్. ఇప్పుడే కాదు వీరి ప్రేమ చిగురించిన కొత్తల నుండే వార్తల్లో ఉండేవాళ్ళు. ఇప్పుడు పెళ్ళైన తర్వాత కూడా వీళ్ళు ఏ మాత్రం తగ్గట్లేదు.గతేడాది వాలెంటైన్స్ డే రోజున విరాట్ కోహ్లీ తన ప్రేమను ఆఫీషియల్ గా అందరి ముందు సోషల్ మీడియా ద్వారా బయటపెట్టాడు. ఎప్పటినుండో రూమర్లు నడుస్తున్నా వాటికి తెర పడింది అప్పుడే. అప్పటినుండి వీరు సోషల్ మీడియా లో తమ ప్రేమను వెళ్ళిబుచ్చడంలో ఏ మాత్రం వెనకడుగు వేయడంలేదు. కనీసం పెళ్లి విషయం కూడా పెళ్లయిపోయాక సోషల్ మీడియా లో పెట్టారు. డిసెంబర్ లో సంప్రదాయబద్ధంగా ఒకటైన వీళ్లు హనీమూన్ కూడా కానిచ్చి ఇండియా తిరిగివచ్చారు. మళ్ళీ విరాట్ క్రికెట్ లోను అనుష్క సినిమాలతో బిజీ అయిపోయారు. కానీ అంత బిజీ షెడ్యుల్స్ లో కూడా ఒకరితో ఒకరు టైం మాత్రం బాగానే స్పెండ్ చేస్తున్నారు.

ఈమధ్యనే తన 35 వ ఓ.డి.ఐ శతకాన్ని నమోదు చేసుకుని క్రెడిట్ అంత తన భార్యకు ఇచ్చిన కోహ్లీ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో పెట్టిన పిక్ వైరల్ గా మారింది. అందులో తన భార్య అనుష్కను గట్టిగా హత్తుకుని ఉన్న విరాట్ "మై వన్ అండ్ ఓన్లీ.." అని రాశాడు. అది చూసి ఫాన్స్ అంతా లవ్ ఈజ్ ఇన్ ద ఎయిర్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.