Begin typing your search above and press return to search.

కన్ఫాం: అనుష్కతో విరాట్ విడిపోయాడు

By:  Tupaki Desk   |   8 Feb 2016 11:30 AM GMT
కన్ఫాం: అనుష్కతో విరాట్ విడిపోయాడు
X
బాలీవుడ్ లో బ్రేకప్ ల హంగామా ఎక్కువగా ఉంది. వరుసగా సెలబ్రిటీలు విడిపోవడం గురించే ఎక్కువగా మాట్లాడుకోవాల్సి వస్తోంది. ఇన్నాళ్లూ రూమర్ అనుకున్న ఓ జంట విడిపోవడం.. ఇప్పుడు కరెక్టే అని తేలిపోయింది. వాళ్లెవరో కాదు.. క్రికెటర్ విరాట్ కోహ్లీ-అనుష్క శర్మ.

ఇండియన్ టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ బ్యూటీ అనుష్క శర్మల ప్రేమాయణం ఇండియాలో కొన్నేళ్లుగా హాట్ టాపిక్. పబ్లిక్ గానే చక్కర్లు, కెమేరాల ముందు ఫ్లయింగ్ కిస్సులతో బాగా అట్రాక్ట్ చేశారు జనాలు. ఇంత ఘాటుగా ప్రేమించుకున్న ఈ జంట విడిపోవడం ఇప్పుడు మరోసారి హాట్ టాపిక్ అయింది. ఓసారి ఇన్ స్టాగ్రామ్ లో హార్ట్ బ్రేక్ అంటూ ఓ ఫోటో పెట్టాడు విరాట్. ఈ ఫోటోను వెంటనే తొలగించినా, ఈలోపే చాలామందికి అనుమానం వచ్చేసింది. ఆ తర్వాత అనుష్కను విరాట్ అన్ ఫాలో చేయడంతో ఫ్యాన్స్ కి అసలు సంగతి అర్ధమైంది. దీనికి తోడు ఇప్పుడు విరాట్ గడ్డం కూడా ఈ జంట బ్రేకప్ ని ఫిక్స్ చేసేసింది.

గడ్డంతో ఎలా తెలుస్తుంది అనుకోవచ్చు కానీ.. పంజాబీ పెళ్లిళ్లలో వరుడు ఖచ్చితంగా గడ్డంతో ఉండడం ఆచారం. అనుష్కతో పెళ్లి కోసమే విరాట్ గడ్డం పెంచాడనే టాక్ ఉంది. ఇఫ్పుడా గడ్డాన్ని తీసేసి కనిపిస్తున్నాడు. పెళ్లికి అనుష్క నో అన్నాకే విరాట్ గడ్డం తీసేశాడన్నది అసలు విషయం. వీళ్లిద్దరి బ్రేకప్ ని విరాట్ సన్నిహితులు కూడా కన్ఫాం చేసేస్తున్నారు. ఓ నెల రోజుల క్రితం విడిపోయారని... అయితే ఈ నిర్ణయం మాత్రం ఖచ్చితంగా విరాట్ కోహ్లీది కాదని చెబుతున్నారు.