విరాట్-అనుష్క.. అదరగొట్టేశారే

Wed Sep 13 2017 17:05:30 GMT+0530 (IST)

విరాట్ కోహ్లి-అనుష్క శర్మ.. ప్రస్తుతం ఇండియాలో అది పెద్ద సెలబ్రెటీ జంట అంటే వీళ్లదేనేమో. ప్రపంచంలోనే టాప్ మోస్ట్ క్రికెటర్లలో ఒకడైన విరాట్ కోహ్లి.. బాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకతైన అనుష్కతో ముడిపడ్డ తొలి రోజుల నుంచి వీరి ప్రేమాయణం ఎప్పుడూ హాట్ టాపిక్కే మధ్యలో కొన్ని నెలలు ఒకరికొకరు దూరంగా ఉన్నప్పటికీ మళ్లీ ఇద్దరూ ఒక్కటై జంటగా సాగిపోతున్నారు. దాదాపు నాలుగేళ్లుగా సాగుతోంది వీరి ప్రేమాయణం. త్వరలో పెళ్లి కూడా చేసుకునే ఉద్దేశంలో ఉన్న ఈ జంట తాజాగా ఒక ప్రకటనలో కలిసి నటించడం ఆసక్తి రేకెత్తిస్తోంది. ఫిలిం ఫేర్ వెబ్ సైట్ తన ఇన్ స్టా గ్రామ్ అకౌంట్లో వీళ్లిద్దరూ కలిసి నటించిన కొత్త యాడ్ కు సంబంధించిన ఫొటో ఒకటి షేర్ చేసింది. ఆ ఫొటోలో ఇద్దరూ పెళ్లి వేడుకల్లో వేసుకునే దుస్తులు ధరించారు.ఇద్దరూ ఆ దుస్తుల్లో వెలిగిపోతున్నారు. ఇద్దరి కెమిస్ట్రీ అదిరిపోయింది ఈ ఫొటోలో. ఇది ఓ దుస్తుల సంస్థకు సంబంధించిన యాడ్ అని భావిస్తున్నారు. త్వరలోనే ఇది టీవీల్లో ప్రసారమవుతుందట. విరాట్-అనుష్క తొలిసారి కలిసింది ఒక యాడ్ షూటింగ్ లోనే కావడం విశేషం. ఒక షాంపూ యాడ్లో ఇద్దరూ కలిసి నటించారు. అప్పుడే వాళ్లిద్దరి మధ్య పరిచయం ఏర్పడి.. తర్వాత ప్రేమగా మారింది. రెండేళ్ల ప్రేమాయణం తర్వాత ఇద్దరి మధ్య బ్రేకప్ అయినప్పటికీ.. ఆశ్చర్యకరంగా మళ్లీ ఇద్దరూ ఒక్కటయ్యారు. బ్రేకప్ తర్వాత కూడా కలిశారంటే ఈ జంట పెళ్లి వైపు అడుగులు వేయడం పక్కా అనాల్సిందే. వచ్చే ఏడాది విరాట్-అనుష్క పెళ్లి చేసుకునే అవకాశాలున్నాయి.