Begin typing your search above and press return to search.

అత్యంత నీచమైన క్రియేటివిటీ ఇదే

By:  Tupaki Desk   |   12 Feb 2016 1:30 PM GMT
అత్యంత నీచమైన క్రియేటివిటీ ఇదే
X
క్రికెట్ కి, బాలీవుడ్ కి చాలానే లింక్స్ ఉంటాయి. గ్లామర్ ఇండస్ట్రీకి ధీటుగా పేరు ప్రఖ్యాతులు సంపాదించగలగడం.. ఇండియాలో క్రికెట్ తోనే సాధ్యం. అంతే కాదు.. క్రికెటర్లు బాలీవుడ్ భామలతో ప్రేమలో పడ్డం కూడా ఎప్పటి నుంచో ఉంది. అయితే, బాలీవుడ్ ప్రేమలన్నీ పెళ్లి వరకూ రావు. వచ్చినవన్నీ కూడా కలకాలం నిలబడవు. ఇప్పుడు టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ - బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మల పరిస్థితి కూడా ఇదే.

బీచుల్లోనూ - ఎయిర్ పోర్టుల్లోనూ - పార్టీల్లోను - యాడ్స్ లోనే కాకుండా క్రికెట్ స్టేడియంలో కూడా వీళ్ల లవ్ స్టోరీ ప్రత్యక్షంగానే కనిపించింది. కానీ పెళ్లి వరకూ వచ్చేసరికి మాత్రం బ్రేకప్ చెప్పేసుకున్నారు. మరి ఇలా విడిపోవడం అనేది వాళ్ల వ్యక్తిగత వ్యవహారమే కానీ.. ఫ్యాన్స్ కి సెలబ్రిటీల పర్సనల్ విషయాలు బాగా ఇంట్రెస్ట్ కలిగిస్తుంటాయి. రకరకాల కామెంట్స్ చేసేస్తూ ఉంటారు. ఇప్పుడో ఔత్సాహికుడు ఏకంగా విరాట్ - అనుష్కల ఫోటోలను మార్ఫింగ్ చేసి నెట్ లో పెట్టేశాడు. విరాట్ కోహ్లీ కుర్చీలో కూర్చుంటే.. ముందు మోకాళ్లపై అనుష్క వంగుని ఉన్నట్లుగాను, ఆమెను వెనకనుంచి విరాట్ తంతున్నట్లుగా డిజైన్ చేసి నెట్ లో పెట్టేశారు.

ఈ ఫోటో ఇప్పుడు ఇంటర్నెట్ లో బాగా వైరల్ అవుతోంది. చూసేందుకు కూడా ఈ ఫోటో బాగా ఏవగింపుగానే ఉంది. అభిమానంతో పాటు క్రియేటివిటీ ఉంటే ఉండచ్చు కానీ.. అది మరీ ఇలా వెర్రితలలు వేసి, అవతలి వారి మనసులు నొప్పించడం కరెక్ట్ కాదనే విషయం తెలుసుకుంటే బెటర్. ఈ ఫోటోపై ఆయా సెలబ్రిటీలు పోలీస్ కేస్ పెట్టనున్నారన్నది కొస మెరుపు