Begin typing your search above and press return to search.

ఈ స్నేహితులు ఒకేసారి మరణించారు

By:  Tupaki Desk   |   29 April 2017 9:46 AM GMT
ఈ స్నేహితులు ఒకేసారి మరణించారు
X
విలక్షణ నటుడు వినోద్ ఖన్నా మరణం హిందీ చిత్ర పరిశ్రమను దిగ్భ్రాంతికి గురిచేసింది. 70 ఏళ్ల వినోద్ ఖన్నా కాన్సర్ తో బాధపడుతూ మొన్న ఉదయం రిలయన్స్ ఫౌండేషన్ హాస్పిటల్ లో తుదిశ్వాశ విడిచిన సంగతి తెలిసిందే. ఈయన మరణ వార్త చాలమందికి దుఖాన్ని మిగిల్చింది. అమితాబ్ - రిషి కపూర్ ఇంకా కొందరు సినీ పెద్దలు తమ స్నేహితుడుకి నివాళ్లు తెలియచేసారు.

రిషి కపూర్ ఒక ఆశక్తికరమైన యాదృచ్ఛిక సంఘటనను తన ట్విటర్ లో పోస్ట్ చేశారు. మా స్నేహితుడు వినోద్ ఖన్నా ఆయన ఫ్రెండ్ ఫిరోజ్ ఖాన్ మరణం ఒకే సారి జరిగింది. 2009 ఏప్రిల్ 27న ఆయన చనిపోయారు. ఇప్పుడు ఖన్నా షాబ్ కూడా అదే రోజున అంటే ఏప్రిల్ 27 2017 లో చనిపోయారు. ఇక వాళ్ళ ఇద్దరి మరణించినప్పుడు వాళ్ళు చనిపోయనప్పుడు వాళ్ళ వయసు 70 ఏళ్ళే. గొప్పగా కలిశాయి కదా అని అన్నారు.

ఇద్దరు ఫ్రెండ్స్ కి ఇలా ఒకే రోజున చావు రావడం కొంత తృప్తినీ ఇస్తుంది అనుకుంట వారి మిగతా ఫ్రెండ్స్ కి. ఆరే మన వాళ్ళు చనిపోవడం లో కూడా వాళ్ళ స్నేహం చాటుకున్నారే అని... బాధ లో ఒక సిల్వర్ లైన్ నీ వెతుక్కుంటారు వీళ్ళు. చనిపోయాన వాళ్ళు బాధ తో పాటు విలువైన మధురనుభూతులును కూడా ఇస్తుంది అనడానికి రిషి కపూర్ ట్వీట్ ఒక ఉదాహరణగా చెప్పవచ్చు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/