Begin typing your search above and press return to search.

పరిచయంలో వినాయక్‌ హ్యాట్రిక్‌?

By:  Tupaki Desk   |   31 Aug 2015 6:20 PM GMT
పరిచయంలో వినాయక్‌ హ్యాట్రిక్‌?
X
వినాయక్‌ అంటేనే సేఫ్‌ డైరెక్టర్‌. అతడు ఒక హీరోని పరిచయం చేస్తున్నాడంటే మినిమం గ్యారెంటీ దక్కినట్టే. బిజినెస్‌ పరంగా ఏ ఢోఖా ఉండదు. మాస్‌ ఆడియన్‌ కి నచ్చకపోవడం ఉండదు. అందుకే తెలివైన వాళ్లంతా తమ పుత్ర రత్నాల్ని వి.వి.వినాయక్‌ చేతిలో పెడుతున్నారు. బెల్లంకొండ సురేష్‌ తనయుడు బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌ ని ఓవర్‌ నైట్‌ స్టార్‌ హీరోని చేసేశాడు. ఓ డెబ్యూ హీరోకి మూడు నాలుగు కోట్ల బిజినెస్‌ పూర్తవ్వడమే కష్టం అనుకుంటే వినాయక్‌ ని చూసి దాదాపు 25 కోట్లు పైగా బిజినెస్‌ చేశారు. వసూళ్లు కూడా ఆ రేంజులోనే దక్కాయి.

అల్లుడు శీను విజయం చూశాక నాగార్జున కూడా మనసు మార్చుకుని అఖిల్‌ ని వినయ్‌ చేతిలోనే పెట్టాడు. వినాయక్‌ అయితేనే అఖిల్‌ ని మాస్‌ హీరోగా నిలబెడతాడన్న నమ్మకంతో అతడికి అప్పజెప్పాడు. ఇటీవలే 'అఖిల్‌' టీజర్‌ వచ్చింది. అంతా ఊహించినట్టే అఖిల్‌ ని ఓ యాక్షన్‌ స్టార్‌ గా రివీల్‌ చేశాడు వినాయక్‌. ఇక ఇప్పటికే ఇద్దరు నటవారసుల్ని తెరకి పరిచయం చేసేసిన వినాయక్‌ ఇప్పుడు నందమూరి నటసింహా బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞని కూడా పరిచయం చేసేందుకు రెడీ అవుతున్నారన్న వార్తలొస్తున్నాయి. ఇప్పటికే వినాయక్‌ స్క్రిప్టు కూడా రెడీ చేస్తున్నారు. శ్రీనుకి హిట్టిచ్చాడు. అఖిల్‌ కి హిట్టివ్వడం ఖాయం అనిపిస్తోంది. ఇక మోక్షజ్ఞను పరిచయం చేసేస్తే వినాయక్‌ హ్యాట్రిక్‌ కొట్టేసినట్టే.

ఇక ప్రస్తుతం.. వినాయక్‌ అఖిల్‌ డెబ్యూ సినిమా అఖిల్‌ తాలూకు పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనుల్లో బిజీనా ఉన్నాడు. మరి తరువాత మహేష్‌ తో ఓ సినిమా అనే రూమర్‌ వచ్చింది. అది చేస్తాడా లేకపోతే స్ర్టయిట్‌ గా మోక్షజ్ఞ దగ్గరకు వెళిపోతాడు ప్రస్తుతానికి సస్పెన్సే.