Begin typing your search above and press return to search.

చిరు 150కి ఛాన్స్.. దేవుడిచ్చిన వరం..

By:  Tupaki Desk   |   29 April 2016 9:19 AM GMT
చిరు 150కి ఛాన్స్.. దేవుడిచ్చిన వరం..
X
మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా ప్రారంభోత్సవం జరిగిపోయింది. కోలీవుడ్ మూవీ కత్తిని తెలుగులో చిరు రీమేక్ చేస్తున్నారనే విషయం ముందే ఫిక్స్ అయినా.. ఇప్పుడా సంగతి అధికారికంగా చెప్పాలి. ముహూర్తం షాట్ కూడా తీసేయడంతో.. ఇక రెగ్యులర్ షూటింగ్ పట్టాలెక్కడమే బ్యాలెన్స్.

ఎనిమిదేళ్ల తర్వాత మెగాస్టార్ సినిమా ప్రారంభం కావడంతో.. ఫ్యాన్స్ ఇప్పుడు మహా హుషారుగా ఉన్నారు. చిరంజీవిని ఆన్ స్క్రీన్ పై చూసేందుకు ఫ్యాన్స్ ఉత్సాహంగా ఉన్నారు సరే.. మరి ఆ చూపించాల్సిన బాధ్యతలను హ్యాండిల్ చేసే దర్శకుడు వివి వినాయక్ సంగతేంటి అనిపించక మానదు. దానికి తనే ఆన్సర్ ఇచ్చాడు వినాయక్. సరిగా చిరంజీవి 150వ సినిమా ప్రారంభానికి ముందు రోజున.. అంతర్వేది లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో.. పూజలు జరిపాడు వినాయక్. సినిమా స్క్రిప్ట్ కు ప్రత్యేక పూజలు చేయించాడు.

'మెగాస్టార్ రీఎంట్రీగా తెరకెక్కుతున్న 150వ సినిమాకి దర్శకత్వం వహించడం దేవుడిచ్చిన వరంగా భావిస్తున్నాను. చరణ్ - అల్లు అర్జున్ లతో సినిమాలు తీసినా.. మెగాస్టార్ ని మరోసారి డైరెక్ట్ చేసే ఛాన్స్ రావడం మాత్రం ఎప్పటికీ స్పెషల్' అంటున్నాడు వినాయక్. ప్రస్తుతం కత్తిలాంటోడు అనే టైటిల్ ని ఈ మూవీకి అనుకుంటుండగా.. జూన్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఇప్పటికి ప్లాన్ చేసిన షెడ్యూల్స్ ప్రకారం అయితే.. 2017 సంక్రాంతికి సినిమా రిలీజ్ కు అవకాశాలున్నాయి.