అవాక్కయ్యేలా చేస్తున్న హౌస్ ఫుల్ బోర్డ్స్

Sat Jan 12 2019 16:21:29 GMT+0530 (IST)

రామ్ చరణ్ - బోయపాటిల కాంబినేషన్ లో రూపొందిన 'వినయ విధేయ రామ' చిత్రం నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రంలోని యాక్షన్ సన్నివేశాలపై సోషల్ మీడియాలో ఏ స్థాయిలో ట్రోలింగ్ వస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చరణ్ ఇలాంటి పాత్రను ఇలాంటి సినిమాను ఎలా కమిట్ అయ్యాడంటూ విశ్లేషకులు అంటున్నారు. ఫ్యాన్స్ కూడా ఈ చిత్రంపై అసంతృప్తితో ఉన్నారు. ఇలాంటి సమయంలో ఈ చిత్రం కలెక్షన్స్ మాత్రం నోరెళ్లబెట్టాలా వస్తున్నాయి.సహజంగా స్టార్ హీరోల సినిమాలకు ఓపెనింగ్స్ భారీగా ఉంటాయి. కాని ఫ్లాప్ మూవీకి మాత్రం కలెక్షన్స్ దారుణంగా ఉంటాయి. రెండవ షో కే కలెక్షన్స్ దారుణంగా పడిపోతాయి. థియేటర్ల ఆక్కుపెన్సీ కూడా చాలా తగ్గుతుంది. కాని వినయ విధేయ రామ చిత్రం విషయంలో సీన్ రివర్స్ అయ్యింది. సినిమాకు ఇంతగా నెగటివ్ టాక్ వచ్చినా కూడా పలు ఏరియాల్లో థియేటర్లు హౌస్ ఫుల్ బోర్డులు పెడుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ క్రాస్ రోడ్స్ లో మూడు థియేటర్లలో ఈ చిత్రం ఆడుతుంది. మూడు థియేటర్లలో కూడా మొదటి రోజు అన్ని షోలు హౌస్ ఫుల్ అయ్యాయి.

భారీ ఓపెనింగ్ వస్తున్నట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు. కొన్ని ఏరియాల్లో నాన్ బాహుబలి రికార్డును కూడా నమోదు చేసిందంటున్నారు. మొత్తానికి వినయ విధేయ రామ ఫ్లాప్ అయినా కలెక్షన్స్ బాగానే రాబడుతూ డిస్ట్రిబ్యూటర్ల నెత్తిన పాళ్లు పోసినట్లయ్యింది. సంక్రాంతి సీజన్ అవ్వడం వల్ల ఈ సినిమా మరి కొన్ని రోజుల పాటు బాగానే ఆడే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.