యూఎస్ ప్రీమియర్స్: చరణ్ సినిమాకు భారీ షాక్!

Fri Jan 11 2019 10:34:23 GMT+0530 (IST)

ఈ సంక్రాంతి సీజన్లో ఆడియన్స్ ఇచ్చే షాకులకు టాలీవుడ్ ఫిలింమేకర్స్ కు దిమ్మతిరిగేలా ఉంది. ఇప్పటికే 'ఎన్టీఆర్ కథానాయకుడు' కలెక్షన్స్ పరిస్థితి నిరాశాజనకంగా ఉంది.  ఓవర్సీస్ విషయయమే తీసుకుంటే 'కథానాయకుడు' సినిమాకు ప్రీమియర్స్ ద్వారా వన్ మిలియన్ డాలర్లు వస్తాయని భావిస్తే హాఫ్ మిలియన్ డాలర్లతో సరిపెట్టుకుంది. ఇక ఈ సీజన్లో మరో భారీ సినిమా చరణ్ 'వినయ విధేయ రామ' ఈరోజు విడుదల అవుతోంది.  అమెరికాలో ప్రీమియర్స్ స్క్రీనింగ్ ఇప్పటికే పూర్తయింది.ఇక యూఎస్ ప్రీమియర్స్ కలెక్షన్స్ ఎలా ఉందంటే ఇప్పటి వరకూ $100 K  కు కాస్త ఎక్కువ గా గ్రాస్ వసూలయిందట. ప్రీమియర్ కలెక్షన్ పూర్తి వివరాలు వచ్చే సరికి ఈ ఫిగర్ $150 K కంటే దాటదని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.  అంటే.. బాలయ్య సినిమా ప్రీమియర్ కలెక్షన్స్ లో ఇది మూడో వంతు! బాలయ్య సినిమాకు  ప్రీమియర్స్ ద్వారా $473K కలెక్షన్స్ వసూలయింది.  ఈ లెక్కన చరణ్ సినిమాకు గురువారం ప్రీమియర్ కలెక్షన్స్ భారీ షాక్ అనే చెప్పాలి.  'రంగస్థలం' లాంటి బ్లాక్ బస్టర్ సాధించి మంచి ఊపులో ఉన్న చరణ్ సినిమాకు ఇలాంటి కలెక్షన్ వస్తుందని ఎవ్వరూ ఊహించలేదు.

ఓవర్సీస్ లో మీడియం రేంజ్ హీరోల సినిమాలకు కూడా ఇంతకంటే బెటర్ గా ప్రీమియర్ కలెక్షన్స్ వస్తాయి.  విజయ్ దేవరకొండ 'నోటా'.. వరుణ్ తేజ్ 'తొలిప్రేమ' ప్రిమియర్ కలెక్షన్స్ 'వినయ విధేయ రామ' కలెక్షన్స్ కంటే మెరుగ్గా ఉండడం గమనార్హం.  ఓవర్సీస్ లో బోయపాటి ట్రాక్ రికార్డ్.. రొటీన్ మాస్ మసాలా ట్రైలర్లు.. వీక్ ప్రమోషన్స్ లాంటివి ఓవర్సేస్ లో ఇలా షాకింగ్ రెస్పాన్స్ రావడానికి కారణం అని భావిస్తున్నారు.