తస్సాదియ్యా మాస్ రామా

Fri Dec 14 2018 15:28:47 GMT+0530 (IST)

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ హీరోగా బోయపాటి శీను దర్శకత్వంలో రూపొందుతున్న వినయ విధేయ రామ ప్రమోషన్ వేగం అందుకుంటోంది. ఇటీవలే విడుదల చేసిన ఫ్యామిలీ సాంగ్ ట్యూన్ పరంగా పిక్చరై జేషన్ యాంగిల్ లో మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నప్పటికీ మాస్ ఆడియన్స్ కోరుకున్న మసాలా అందులో లేదు కాబట్టి ఫ్యాన్స్ జస్ట్ ఓకే అనుకున్నారు. అందుకే వాళ్ళను టార్గెట్ చేసి ఈ నెల 17న మధ్యాన్నం 4 గంటలకు తస్సాదియ్య అనే మరో సింగల్ విడుదల చేయబోతున్నారు.దీని తాలూకు పోస్టర్ ఇప్పుడు ఆన్ లైన్ లో వైరల్ అవుతోంది. అందులో ఆకుపచ్చ గౌన్ లో కియారా అద్వానీ మెరిసిపోతూ ఉండగా కొదమసింహం పాటలో చిరుని తలపించేలా చరణ్ వేసుకున్న కాస్ట్యూమ్స్ తో అంచనాలు ఎక్కడికో వెళ్లిపోతున్నాయి. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన వినయ విధేయ రామలో ఇది హీరో హీరోయిన్ మధ్య వచ్చే పాటగా క్లారిటీ వచ్చేసింది. తస్సాదియ్యా అని ఉంది కాబట్టి కావాల్సినన్ని బీట్స్ తో పాటు వెర్రెక్కించే చరణ్ స్టెప్స్ కు ఢోకా లేకుండా ఉంటుంది.

మాస్ ఫ్యాన్స్ కూడా ఇలాంటి పాట కోసమే ఎదురు చూస్తున్నారు. ఈ నెల 25 లేదా 27న జరిపే ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో ట్రైలర్ విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. సంక్రాంతి రేస్ లో ఉన్న సినిమాలు అన్నిటిలోకి అవుట్ అండ్ అవుట్ మాస్ ఎంటర్ టైనర్ గా బరిలో దిగుతున్న వినయ విధేయ రామకు బోయపాటి బ్రాండ్ తో మెగా పవర్ తోడవ్వడంతో బాక్స్ ఆఫీస్ మరోసారి బద్దలు కావడం ఖాయమని అభిమానులు బలంగా నమ్ముతున్నారు. పోస్టర్ చూస్తుంటే ఆ మాత్రం అంచనాలు పెట్టుకోవడం తప్పేమి కాదనిపిస్తోంది.