Begin typing your search above and press return to search.

వినయ లాభాల రామ

By:  Tupaki Desk   |   15 Dec 2018 9:45 AM GMT
వినయ లాభాల రామ
X
రంగస్థలం తర్వాత పది నెలల గ్యాప్ తో వస్తున్న వినయ విధేయ రామ మీద మెగా ఫ్యాన్స్ అంచనాలు మాములుగా లేవు. ఇప్పటికే వదిలిన టీజర్ ఇందులో ఏ రేంజ్ లో మాస్ ఉంటుందో చూపించేసారు కాబట్టి రికార్డులు బద్దలు కొట్టడం ఖాయమనే నమ్మకం తో ఉన్నారు. అయితే నిర్మాత దానయ్య మాత్రం ఇంకా రిలీజ్ కాకుండా కళ్ళు చెదిరే లాభాలు కళ్ళజూస్తున్నట్టు ఇన్ సైడ్ టాక్. విశ్వసనీయ సమాచారం మేరకు వివిఆర్ నైజాం హక్కులు అవుట్ రైట్ గా 24 కోట్లకు అమ్ముడుపోయాయట. ఇది చెర్రి కెరీర్ లో హయ్యెస్ట్.

ఇక హింది డబ్బింగ్ ప్లస్ అమెజాన్ ప్రైమ్ తో కుదిరిన డిజిటల్ ఒప్పందాల ద్వారా 22 కోట్లు వచ్చినట్టుగా తెలిసింది. వెస్ట్ గోదావరి కు 6 కోట్ల దాకా డీల్ జరుగుతున్నట్టు వినికిడి. ఇక ఏ ఏరియా తీసుకున్నా ఇలాంటి షాకింగ్ ఫిగర్స్ నమోదవుతున్నాయని వీటిని బట్టి అర్థమవుతోంది. థియేట్రికల్ బిజినెస్ ద్వారానే 80 కోట్లు సమకూరనున్నట్టు తెలిసింది. మొత్తం గా చూసుకుంటే 120 కోట్ల ఫైనల్ బిజినెస్ తో వస్తున్న వినయ విధేయ రామ అరాచకం మాములుగా ఉండేలా లేదు. ఈ లెక్కల ప్రకారం చూసుకుంటే మిగిలిన రెండు పోటీ సినిమాలు ఎఫ్ 2 ఎన్టీఆర్ ల కంటే చెర్రి సినిమానే ముందంజలో ఉంది.

దేవి శ్రీ ప్రసాద్ సంగీతం ప్రధాన ఆకర్షణ గా కీయరా అద్వాని హీరొయిన్ గా రూపొందిన వినయ విధేయ రామ అన్నదమ్ముల అనుబంధాన్ని హై లైట్ చేస్తూనే హై వోల్టేజ్ యాక్షన్ డ్రామాని బోయపాటి శీను తీర్చిదిద్దినట్టు టాక్ బలంగా ఉంది. జీన్స్ ప్రశాంత్ నిన్నటి తరం హీరో ఆర్యన్ రాజేష్ చరణ్ అన్నయ్యలు గా కీలక పాత్రలు చేసిన వినయ విధేయ రామ లో వివేక్ ఓబెరాయ్ విలనీ మరో స్పెషల్ అట్రాక్షన్.