ఫస్ట్ డే కలెక్షన్స్..ఆల్ టైం రికార్డ్

Sat Jan 12 2019 17:23:33 GMT+0530 (IST)

వినయ విధేయ రామ చిత్రంకు మొదటి షో కే నెగటివ్ టాక్ వచ్చింది. దాంతో కలెక్షన్స్ చాలా తక్కువగా ఉంటాయని అంతా భావించారు. కాని అనూహ్యంగా ఈ చిత్రంకు మొదటి రోజు భారీగా వసూళ్లు వచ్చాయి. అది మామూలుగా కూడా కాదు ఆల్ టైం టాప్ 4లో నిలిచేలా వినయ విధేయ రామ చిత్రం కలెక్షన్స్ వచ్చాయి. ఒక ఫ్లాప్ మూవీకి ఆల్ టైం టాప్ చిత్రాల స్థాయిలో వసూళ్లు రావడం అంటే మామూలు విషయం కాదు.  మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం ఏకంగా 25.87 కోట్ల కలెక్షన్స్ ను రాబట్టింది. సీడెడ్ లో ఆల్ టైం రికార్డును సొంతం చేసుకుంది.ఏరియాల వారిగా వినయ విధేయ రామ మొదటి రోజు కలెక్షన్స్ :
నైజాం : 5.08 కోట్లు
సీడెడ్ : 7.15 కోట్లు
ఉత్తరాంద్ర : 2.45 కోట్లు
ఈస్ట్ : 2.05 కోట్లు
వెస్ట్ : 1.83 కోట్లు
గుంటూరు : 4.17 కోట్లు
కృష్ణ : 1.45 కోట్లు
నెల్లూరు : 1.69 కోట్లు

మొత్తం : 25.87 కోట్లు


Disclaimer: Data Gathered from Various Confidential Sources And May Also Include estimates. Use And Follow at your Own Discretion. We Dont Guarantee Any Authenticity Of the Same.