Begin typing your search above and press return to search.

సెన్సార్ పూర్తి చేసుకున్న వీవీఆర్

By:  Tupaki Desk   |   5 Jan 2019 11:29 AM GMT
సెన్సార్ పూర్తి చేసుకున్న వీవీఆర్
X
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ - బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కిన 'వినయ విధేయ రామ' సంక్రాంతి సీజన్లో పోటీకి సిద్ధం అవుతోంది. తాజా సమాచారం మేరకు ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. సంక్రాంతి సినిమాల్లో అన్నిటికంటే చివరిగా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది ఈ సినిమానే కావడం గమనార్హం.

సినిమాను చూసిన తర్వాత సెన్సార్ వారు 'U/A' రేటింగ్ ఇచ్చారట. బోయపాటి సినిమాలలో వయోలెన్స్ డోస్ కాస్త ఎక్కువగానే ఉంటుంది కాబట్టి క్లీన్ 'U' సర్టిఫికేట్ రావడం కష్టమైన విషయమే. కానీ సింగిల్ కట్ లేకుండా సినిమాకు సర్టిఫికేట్ మంజూరు చేశారని సమాచారం. ఇదిలా ఉంటే సినిమా 'వినయ విధేయ రామ' టీమ్ ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. చరణ్ - కియారాలు ఈమధ్యే ప్రమోషన్స్ లో భాగంగా రానా హోస్ట్ చేసే 'నం. 1 యారి' షో లో కూడా పాల్గొన్నారు. ఇదే కాకుండా ఇతర ఇంటర్వ్యూలలో పాల్గొంటూ సినిమాపై క్రేజ్ మరింతగా పెంచే ప్రయత్నాలు చేస్తున్నారు.

వివేక్ ఓబెరాయ్ విలన్ గా నటిస్తున్న ఈ సినిమాలో ఆర్యన్ రాజేష్.. ప్రశాంత్.. స్నేహ.. మధునందన్.. రవి వర్మ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నాడు. దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీత దర్శకుడు. డీవీవీ దానయ్య ఈ సినిమాను డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నాడు. జనవరి 11 న 'వినయ విధేయ రామ' ప్రేక్షకుల ముందుకు రానుంది.