వినయ విధేయ రామా బిజినెస్

Wed Dec 12 2018 10:00:35 GMT+0530 (IST)

టాలీవుడ్ టాప్ మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న `వినయ విధేయ రామా` ప్రస్తుతం హాట్ టాపిక్. `రంగస్థలం` లాంటి మాసివ్ ఇండస్ట్రీ హిట్ తర్వాత మాస్‌లో బాస్ నేనే అని నిరూపించిన మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరోసారి మాస్ లో పవర్ చూపించేందుకు ఎంతో క్యాలిక్యులేటెడ్‌గా బోయపాటిని ఎంచుకున్న సంగతి తెలిసిందే. సంక్రాంతి బరిలో సంక్రాంతి పుంజులా భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ని ఫ్యామిలీ సెంటిమెంటు రంగరించి అందించాలన్నది ఈ జోడీ ప్రాధమిక ఆలోచన అని అర్థమైంది. ఎంచుకున్న టైటిల్ ఎంత క్లాస్ గా ఉందో ఇటీవల రిలీజ్ చేసిన టీజర్ అంతే మాసీగా ఉండడంతో అసలు వీళ్ల స్ట్రాటజీ ఏంటో? అన్న చర్చా అభిమానుల్లో నడిచింది.మాస్ కంటెంట్ కి ఉండే పవర్ ఎంతో ప్రస్తుతం జరుగుతున్న `వినయ విధేయ రామా` ప్రీరిలీజ్ బిజినెస్ చెబుతోంది. ఇప్పటికే ఈ సినిమాకి హిందీ డబ్బింగ్ - శాటిలైట్ రూపంలో  22కోట్ల డీల్ పూర్తయిందంటూ ప్రచారం సాగింది. అలాగే నైజాం లో 24కోట్ల రేంజ్ బిజినెస్ చేస్తున్నారన్న సమాచారం అందింది. దీంతో పాటే గోదారి జిల్లాల్లో సుమారు 10కోట్ల పైపెచ్చు బిజినెస్ సాగనుందని తెలుస్తోంది. పశ్చిమ గోదావరి జిల్లాలో భారీ కాంపిటీషన్ నడుమ 5.6 కోట్లకు డీల్ కుదిరిందని ఎన్ ఆర్ ఏ బేసిస్ లో గీతా ఫిలింస్ సంస్థ హక్కులు ఛేజిక్కించుకున్న సంగతి తెలిసిందే. పశ్చిమ గోదావరి జిల్లాలో ‘రంగస్థలం’ సినిమాను 4.2 కోట్లకు రైట్స్ కొనుక్కుంటే- 6.35కోట్ల షేర్ వసూలు చేసింది. ఇప్పుడు అంతకుమించి `వినయ విధేయ రామా` వసూలు చేయాల్సి ఉంటుందన్న చర్చా సాగింది. `రంగస్థలం` గోదారి నేటివిటీతో తెరకెక్కి అక్కడ యాస భాష ప్రవృత్తిని ఎలివేట్ చేయడంతో భారీ కలెక్షన్స్ సాధించింది. మరోసారి చెర్రీ ఆ మ్యాజిక్‌ని రిపీట్ చేయగలగడని అక్కడ పంపిణీదారులు నమ్ముతున్నారట.

అలాగే గుంటూరు ఏరియాలోనూ `రంగస్థలం` భారీ కలెక్షన్స్ సాధించి పంపిణీదారులకు లాభాలు పండించింది. దీంతో అక్కడా `వినయ విధేయ రామా` చిత్రానికి భారీ డిమాండ్ నెలకొందట. తాజాగా గుంటూరు సీ- డీ కేంద్రాల హక్కుల కోసమే 1.6 కోట్లు వెచ్చించి జయరామ్ అనే పంపిణీదారుడు చేజిక్కించుకోవడం వేడెక్కిస్తోంది. దీంతో పాటే ఇతర ఏరియాల బిజినెస్ గురించి పంపిణీదారుల్లో పోటీ నెలకొందట. అలాగే ఓవర్సీస్ లోనూ భారీ రిలీజ్ కి సన్నాహాలు చేస్తున్నారు. సంక్రాంతి బరిలో ఈ సినిమా `ఎన్టీఆర్- కథానాయకుడు` రిలీజైన(జనవరి 9) వెంటనే అంటే జనవరి 11న వినయ విధేయ రామా రిలీజవుతోంది. అలాగే సంక్రాంతి బరిలోనే వెంకీ-వరుణ్ తేజ్ ల `ఎఫ్ 2` రజనీకాంత్ పెట్టా అజిత్ విశ్వాసం పోటీకి దిగుతున్నాయి. ఇంత భారీ కాంపిటీషన్ ఉన్నా చరణ్ `వినయ విధేయ రామా` సత్తా చాటుతుందని అభిమానులు భావిస్తున్నారు.